ఆర్టీసీపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. శుక్రవారం హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కార్మికుల పొట్టకొట్టకుండా సానుకూల దృక్పథంతో వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్మికులను సస్పెండ్ చేయాలని ఏ చట్టమూ చెప్పలేదని… కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారమే చేశామని తమపై నేరాన్ని నెట్టేసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు.హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితాలను ఉద్దేశిస్తూ.. ఇల్లలకగానే పండగ కాదని.. ముందుంది మొసళ్ల పండగని వ్యాఖ్యానించారు.