iDreamPost
android-app
ios-app

గుజరాత్‌లో బీజేపీ జైత్ర యాత్రకి బీజం వేసిన కేశుభాయ్ పటేల్

  • Published Jan 26, 2021 | 8:47 AM Updated Updated Jan 26, 2021 | 8:47 AM
గుజరాత్‌లో బీజేపీ జైత్ర యాత్రకి బీజం వేసిన కేశుభాయ్ పటేల్

ప్రధాన మంత్రి మోడికీ రాజకీయ గురువుగా , ఆరుసార్లు గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టిన రాజకీయ భీష్ముడిగా, కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలో బీజేపీకి గట్టి పునాదులు వేసిన నేతగా కేశుభాయి పటేల్ జాతీయ స్థాయిలో సుపరిచితులు. 1928 జూలై 24 న జన్మించిన కేశుభాయ్ పటేల్, 1940ల నుండి ఆర్ఎస్ఎస్ సభ్యుడుగా ఉంటూ ప్రచారక్ గా వ్యవహరించారు. 1960లలో భారతీయ జనసంఘ్ నుంచి తన రాజకీయ ప్రయాణన్ని మొదలు పెట్టి రాజ్ కోట్ నుంచి మున్సిపాలిటి, మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తరువాత 1970లలో జనతా పార్టీలో ఉండి ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపారు. 1980 నుండి భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో కీలక సభ్యుల్లో ఒకరుగా ఉన్నారు.

1990 నుంచి గుజరాత్ రాష్ట్రంలో కేశుభాయి పటేల్ హవా సాగింది. 1990 మార్చి 4 నుండి 1990 అక్టోబర్ 25 వరకు జనతాదళ్ చిమన్‌భాయ్ పటేల్ ప్రభుత్వంలో గుజరాత్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఉన్నత పదవికి చేరుకున్న మొదటి రాష్ట్ర రాజకీయ నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1995 ఎన్నికలలో కేశుభాయ్ పటేల్ నాయకత్వంలో బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యటంతో గుజరాత్‌లో బీజేపీ జైత్ర యాత్ర మొదలైంది. గుజరాత్ రాజకీయాల్లో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి మాధవ్ సింఘ్ సోలంకి, చిమన్ భాయ్ పటేల్ తరువాత కేశుభాయ్ పటేల్ బీష్ముడిలాంటి వారుగా చెబుతారు. అయితే బీజేపీలోని అంతర్గత పోరుతో 1995-1998 మధ్య గుజరాత్‌కు నలుగురు ముఖ్యమంత్రులు మారారు.

1995 ఎన్నికల గెలుపు అనంతరం శంకర్ సింగ్ వాఘేలా కేశుభాయిపై తిరుగుబాటు చేయడంతో ఏడు నెలల తరువాత రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు.

కేశుభాయ్ తరువాత సురేష్ మెహత,ఆ తరువాత భారతీయ జనతా పార్టీ నుండి చీలీ రాష్ట్రియ జనతా పార్టీని స్థాపించి కాంగ్రెస్ మద్దతుతో రాష్ట్రపతిపాలన అనంతరం శంకర్ సింఘ్ వఘేల, దిలిప్ పారిఖ్ లు ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ విషయాన్ని గమనిస్తె కాంగ్రెస్ మాత్రమే ముఖ్యమంత్రులను మారుస్తుంది అన్నది అర్ధసత్యం అని తెలుస్తుంది. ఇక 1998 ఎనికల్లొ బీజేపీ గెలిచి కేశుభాయ్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ బీజేపీ అంతర్గత సమస్యలు, 2001 లో గుజరాత్‌లో ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఆశించినంత విజయం లభించకపోవుటచే, పాలనా వైఫల్యాలు లాంటి కారణాలతో కేశుభాయిని పదవి నుంచి దించి 2001 లో నరేంద్ర మోడిని ముఖ్యమంత్రిని చేశారు. ఆ విధంగా మోడి ప్రధాన రాజకీయ స్రవంతి మొదలైంది.

2002 ఎన్నికల్లో పోటీనుంచి దూరంగా ఉన్న కేశుభాయ్ పటేల్ అదే ఏడు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2007లో జరిగిన ఎన్నికల్లో మోడి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తు తిరుబాటు బావుట ఎగరవేశారు. ఆ ఎన్నికల్లో కనీసం ఓటు కూడా వేయకుండా మోడికి వ్యతితేకంగా తన నిరసనను బీజేపీ హైకమాండ్ కు తెలియచేశారు. తరువాత 2012 లో బీజేపీని విడిచిపెట్టి గుజరాత్ పరివర్తన్ పార్టీని స్థాపించారు. 2012 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విసావదార్ నుంచి ఎన్నికైన ఆయన అనంతరం అనారోగ్య కారణంగా 2014 లో రాజీనామా చేసి తమ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఇటీవల కేశుభాయి పటేల్ కరోనా మహమ్మారి సోకడంతో మరణించారు. మోడి ప్రభుత్వం ఆయనకు పద్మ భూషన్ అవార్డును ఇస్తూ నిన్నటి రోజున ఉత్తర్వులు విడుదల చేసింది.