iDreamPost
android-app
ios-app

భూసేకరణతో పాటు పలు హక్కుల మీద స్పష్టతనిచ్చిన కేశవానంద భారతి కేసు

భూసేకరణతో పాటు పలు హక్కుల మీద స్పష్టతనిచ్చిన కేశవానంద భారతి కేసు

స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన కేసుగా పరిగణింపబడే కేశవానంద భారతి కేసుకు ఆద్యుడైన స్వామి కేశవానంద భారతి పరమపదించారు. అయితే ఆయన పేరున ఉన్న 1973 నాటి ఈ కేసు రాజ్యాంగ మౌలిక సూత్రాలను కాపాడేందుకు గట్టి పునాది వేసింది.

కేశవానంద భారతి ఎడ్నీర్ మఠాధిపతి.1970 లో కేరళ లో భూ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. లా చదివిన వారు కేశవానంద భారతి పేరు తలుచుకోకుండా పరీక్షలో వ్రాయకుండా ఉండరు. అలాగే రాజ్యాంగ నిపుణులు ఈ కేసును ఉదహరించకుండా వాదించలేరు. ఈ కేసును ఉద్దండులు ఫాలీ నారిమణ్, సోలీ సొరాబ్జీ, ఫాల్కీవాలా లాంటి వారు వాదించారు. 13 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పరిచిన ఏకైక కేసు.

మఠానికి సంబంధించిన ఆస్తులు ప్రభుత్వ స్వాధీనం కాకుండా కేసు వేయడం జరిగింది. ప్రజా ప్రయోజనాల కొరకు భూమి తీసుకుంటే ఆర్టికల్ 31 ప్రకారం కేసు పెట్టాలి, కానీ పాల్కీవాలా ఆర్టికల్ 26 ప్రకారం కేసు ధాఖలు చేయడానికి కేశవానంద భారతిని ఒప్పించారు. అసలు ఆర్టికల్ 26 అంటే ప్రభుత్వ జోక్యం లేకుండా మత సంబంధిత ఆస్తుల నిర్వహణ. దీని ప్రకారం తెలివిగా వేయడం జరిగింది. ఈ కేసు లో పార్లమెంట్ కు రాజ్యాంగం సవరించే హక్కు ఉందా అనే అంశం పాల్కీవాలా చేర్చడంతో దానిపై వాదనలు జరగడం వల్ల ప్రధానంగా లాయర్లు ఈ కేసును ఉదహరిస్తారు. ఇక్కడొక తమాషా కూడా ఉంది.పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గోలక్నాధ్ కేసులో చెప్పారంటారు…ఆ గోలక్నాధ్ తీర్పు ప్రామాణికంగా తీసుకున్నారు..ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంట్ కు రాజ్యాంగం సవరించే హక్కు ఉంది. కానీ జడ్జిమెంట్ ప్రకారం మౌళిక స్వరూపం మార్చకూడదు తో పాటు ప్రవేశిక (preamble) రాజ్యాంగంలో భాగం అని తీర్పు నిచ్చారు.

మరోవైపు న్యాయవ్యస్థను రాజకీయ వ్యవస్థ ప్రభావితం చేయగలగడం కూడా ఈ కేసు నుండే మొదలయింది. న్యాయమూర్తులు కూడా ఒకేతాటిపై నిలబడడం, తిరిగి వ్యక్తిగత అంశాల కారణంగా న్యాయమూర్తుల్లో చీలిక రావడం వంటివి కూడా ఈ కేసునుండే మొదలయ్యాయి. అప్పటికే ఇందిరా గాంధీ ప్రభుత్వం బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు కేసుల్లో ఓటమి చూసింది. ఇప్పుడు ఈ కేసు ద్వారా మరో ఓటమి.

ఈ కేసు విచారణలో భాగమైన న్యాయమూర్తి జస్టిస్ ద్వివేది కుమార్తెకు అప్పటి కేంద్ర మంత్రి బహుగుణ కొడుకుతో పెళ్ళి జరిగింది. బంధుత్వమో లేక్ అంటారో కారణమో కానీ విచారణ సమయంలో స్వామి కేశవానంద భారతి తరపున వాదిస్తున్న న్యాయవాది నానీ పాల్కివాలాను ఇబ్బందిపెట్టే పలు ప్రశ్నలు జస్టిస్ ద్వివేది సంధించారు. ఒక సందర్భంలో పార్లమెంటు తరుపున వకాల్తా పుచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు.

రాజ్యాంగ మౌలిక రూపం పటిష్టంగా ఉండడంతో పాటు న్యాయవ్యవస్థపై రాజకీయ వ్యూహాలు విజయం సాధించడం లేదా న్యాయవ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నాలు ఈ కేసు నుండే మొదలయ్యాయని చెప్పొచ్చు.

సుప్రీం కోర్టులో ఏకబిగిన 67 రోజులు సాగిన విచారణ, 703 పేజీల తీర్పు. ఈ కేసులో అటార్నీ జనరల్ వాదనలో సుమారు 73 దేశాల రాజ్యాంగాలు వివరించారట.

కేసు తీర్పు తరువాత జరిగిన పరిణామాలు కీలకమైనవి. ఈ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న న్యాయమూర్తులలో ఒకరు, సీనియారిటీ లో నాల్గవ స్థానంలో ఉన్న జస్టిస్ ఎ.ఎన్ రే ని ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం గమనించదగినది. జస్టిస్ సిక్రీ ఇందిరా గాంధీ కి వ్యతిరేకంగా పోరాడిన రాజ్యాంగ యోధుడైతే,కేశవానంద భారతి పరిరక్షకుడు.

ప్రధానమంత్రి పై కేసులు లేకుండా

ప్రధాన మంత్రి మీద ఎలాంటి కేసులు పెట్టటానికి వీలు లేకుండ ఇందిరాగాంధీ హయాంలో చేసిన 39వ రాజ్యాంగ సవరణ కొట్టివేయడానికి కేశవానందభారతి కేసు ఉపయోగపడింది. అలాగే అనేక కీలక రాజ్యాంగ పరిరక్షణ కేసులకు ఈ కేసు తీర్పు ఉపయోగపడింది.

కేశవానంద భారతి కేసు తిరగతోడడానికి ఛీఫ్ జస్టిస్ రే ప్రయత్నించినా పాల్కీవాలా కేసు రివ్యూ చేయడానికి వీలు లేదని వాదించి మూసివేయించారు. అలాంటి కేశవానంద భారతి మృతికి నివాళులు.