ఆర్టీసీ సమ్మె కార్మికుల ఉసురు తీస్తోంది. శనివారం ఉదయం నార్కట్‌పల్లి డిపో డ్రైవర్ వెంకటేశ్వర్లు ఆత్మగత్య చేసుకున్నారు. స్థానిక లారీ అసోసియేషన్ కార్యాలయం దగ్గర అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను స్థానికులు గుర్తించారు.చనిపోవడం తో పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పరిశీలించి సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.