iDreamPost
android-app
ios-app

వైసీపీ గూటికి కారెం శివాజీ

వైసీపీ గూటికి కారెం శివాజీ

టీడీపీ నుండి వైసిపిలోకి వలసల పర్వం కొనసాగుతుంది. అందరు ఊహించినట్టుగానే కారెం శివాజీ వైసీపీ లో చేసారు. గతంలో ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీ కమీషన్ చైర్మన్ గా శివాజీ పనిచేసారు. ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేసారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ కండువా కప్పి కారెం శివాజీని పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీలో కొనసాగిన శివాజీ నేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Read Also: కారెం శివాజీ కూడా

కారెం శివాజీ SC విభజనను వ్యతిరేకించిన దళిత నాయకుల్లో ఒకరు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా కారెం శివాజీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు జగన్ విధానాలని తీవ్రంగా వ్యతిరేకించి, జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన కారెం శివాజీ నేడు అదే జగన్ గూటికి చేరడం విశేషం.