iDreamPost
iDreamPost
రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు వచ్చేసినా కొత్త సినిమాలు ఏవీ లేకపోవడంతో పాటు 50 శాతం సీటింగ్ పట్ల డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కనీసం 75 శాతం ఉంటే ఏదైనా ఆశించవచ్చని వాళ్ళ అభిప్రాయం. ఇదిలా ఉండగా ఇప్పటిదాకా ఖచ్చితంగా ఫలానా టైంలో తమ సినిమా విడుదల అవుతుందని చెప్పినవారు లేరు. 2021 సంక్రాంతికి ఓ అయిదారు కర్చీఫులు వేసుకున్నాయి కానీ డిసెంబర్ గురించి మాత్రం ఎలాంటి ఊసు లేదు. సోలో బ్రతుకే సో బెటరూ అన్నారు కానీ ఇంకా డేట్ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా పరిస్థితులను విశ్లేషించే ఆలోచనలోనే ఉన్నారు.
తాజాగా సుమంత్ కపటధారి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ విడుదలను లాక్ చేసుకుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికెట్ తెచ్చుకుంది. కన్నడలో గత ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన కవలుదారికి ఇది అఫీషియల్ రీమేక్. ట్రైలర్ కూడా గత నెలే వచ్చేసింది. పెద్దగా మార్పులు చేయకుండా యధాతథంగా తీసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో సుమంత్ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గా నటించాడు. తనకు సంబంధం లేని ఓ రోడ్ యాక్సిడెంట్ కేసులో విచారణకు పూనుకున్న హీరోకి చాలా ప్రమాదాలు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదురుకున్నాడనేదే ఇందులో అసలు కథ. ఒరిజినల్ వెర్షన్ కు క్రిటిక్స్ ప్రశంసలు దక్కాయి.
మళ్ళీ రావా రూపంలో చాలా భారీ గ్యాప్ తర్వాత కంబ్యాక్ చేసుకున్న సుమంత్ కు ఆ తర్వాత సుబ్రమణ్యపురం, ఇదం జగత్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఆశలన్నీ కపటధారి మీదే పెట్టుకున్నాడు. మరో రెండు సినిమాల్లో నటిస్తున్న సుమంత్ మరోసారి మీడియం రేంజ్ లో సెటిలయ్యేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నారు. కంటెంట్ ఉండాలే కానీ ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో హీరో ఎవరనేది పట్టించుకోవడం లేదు. అందుకే సబ్జెక్టుల మీద గట్టిగానే ఫోకస్ పెడుతున్నారు. సోలో బ్రతుకే సో బెటరూ, కపటధారిల ప్రకటనలు చూసాకైనా ఇంకొందరు నిర్మాతలు అనౌన్స్ మెంట్లు చేస్తే బాగుంటుంది