iDreamPost
iDreamPost
కన్నడ పవర్ స్టార్ గా పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా చాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ఆయనను చేర్చిన విక్రమ్ హాస్పటల్ వద్ద లక్షలాది అభిమానులు గుమికూడుతున్నారు. బెంగళూరు పోలీసులు పలు మార్గాలను బ్లాక్ చేయడంతో పాటు సినిమా థియేటర్లను మూసి వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు అంతర్గతంగా తెలుస్తున్న సమాచారం. సోనూ సూద్, మంచు లక్ష్మి లాంటి సెలబ్రిటీలు ఆర్ఐపి మెసేజులు కూడా ట్వీట్ చేశారు.
గతంలో రాజ్ కుమార్ చనిపోయినప్పుడు జరిగిన సంఘటనల్లో కొందరు మృతి చెందారు. అది మళ్ళీ జరగకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. పునీత్ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు చెప్పడం లేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం అని మాత్రమే ప్రకటిస్తున్నారు. దీన్ని బట్టి భయపడిందే జరిగిందానే ఆందోనళ సర్వత్రా వ్యక్తమవుతోంది. అన్నయ్య శివ రాజ్ కుమార్ తో సహా కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ బొమ్మై వ్యక్తిగతంగా అక్కడికి వెళ్లి పరామర్శించారు. మరికాసేపట్లో పునీత్ గురించి ఖచ్చితమైన సమాచారం వెలువడే ఆవకాశం ఉంది.
Also Read : విక్రమ్ అంత రిస్క్ ఎందుకు చేస్తున్నట్టు