iDreamPost
android-app
ios-app

హనుమంతరాయ చౌదరి పదవి కోసమేనా యాత్రలు,కొట్లాటలు?

హనుమంతరాయ చౌదరి పదవి కోసమేనా యాత్రలు,కొట్లాటలు?

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాటలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. జెసి దివాకర్ రెడ్డి పుణ్యమా అని మొదలైన ఈ ముసలం ముదిరి పాకాన పడుతున్న పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి 2014 నుంచి 2019 వరకు ఉన్నం హనుమంతరాయ చౌదరి ఎమ్మెల్యేగా పనిచేశారు.దాదాపు దశాబ్ద కాలం అనంతపురం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా హనుమంతరాయ చౌదరి పనిచేశాడు.

అయితే అనూహ్యంగా 2019 ఎన్నికల సమయంలో మాత్రం హనుమంతరాయ చౌదరికి చంద్రబాబు టికెట్ నిరాకరించారు, జిల్లా టిడిపి మొత్తానికి పెద్ద తలకాయగా భావిస్తున్న జెసి దివాకర్ రెడ్డి ఒత్తిడితో ఉమామహేశ్వర నాయుడుకి టీడీపీ టికెట్ ఇచ్చింది. అయితే ఆయన వైసీపీ అభ్యర్థి ఉష శ్రీ చరణ్ చేతిలో ఓటమి పాలయ్యారు. గెలిచే అవకాశం లేదు కాబట్టి టిక్కెట్ ఇవ్వడం లేదని చెప్పి హనుమంతరాయ చౌదరిని పక్కన పెడితే ఇప్పుడు ఉమామహేశ్వర నాయుడు కూడా ఓటమి పాలవడంతో కళ్యాణదుర్గం టిడిపిలో ఒక రకమైన ఆధిపత్య పోరు నెలకొంది.

Also Read:మాజీ సీఎం మరదలు – ఫుట్ పాత్ పై దయనీయ స్థితిలో

మరీ ముఖ్యంగా గత ఏడాది అయితే ఈ వ్యవహారం పాఠక స్థాయికి చేరి ఒకే టిడిపి ఆఫీస్ కు రెండు తాళాలు వేసిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఉండగా తానే ఈ నియోజకవర్గం ఇంచార్జ్ అని అప్పట్లో హనుమంతరాయ చౌదరి కూడా ప్రకటించుకున్నారు. అప్పట్లో ఈ వ్యవహారంలో జిల్లా టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయించారు. తాజాగా మరోసారి ఈ ఇద్దరు నేతల వర్గాలకు మధ్య ఘర్షణ చెలరేగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ పనులను టిడిపి నాయకులు పరిశీలించారు. ఈ పరిశీలనకు వెళ్లిన సమయంలో ఉమామహేశ్వర నాయుడు,  హనుమంతరాయ చౌదరి వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో నాయకులు కార్యకర్తలు ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్ళింది, వెంటనే మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి రంగంలోకి దిగి ఇరుపక్షాల వారిని శాంతింపజేశారు.

ఈ నియోజకవర్గంలో ఎవరో ఒకరికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించకపోతే ఖచ్చితంగా మళ్లీ మళ్లీ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక పరిశీలనకి వెళ్లిన వారిలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ రెడ్డి, ప్రభాకర్ చౌదరి, హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు, పరిటాల శ్రీరామ్ తదితరులు ఉన్నారు.

Also Read : పోల‘వర’మే.. డెల్టాకు ఎడారి అంటూ తప్పుడు ప్రచారం

ఇక మరోపక్క ఈరోజు తెలుగుదేశం పార్టీ అనంతపురంలో ఒక సదస్సును నిర్వహిస్తోంది. కృష్ణా జలాల పంపిణీ విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ అంటోంది, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ కారణంగా రాయలసీమ నష్టపోతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు . ఈరోజు జరుగుతున్న సదస్సులో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

సీఎం జగన్మోహన్ రెడ్డి కృష్ణ నది మీద ఉన్న ప్రాజెక్ట్ లను కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర జలశక్తి శాఖకు ఉత్తరమ్ రాసినప్పుడు టీడీపీ నేతలు స్పందించకుండా సీఎం కోరినట్లు కేఆర్ఎంబి గెజట్ విడుదలయిన తరువాత దాని మీద టీడీపీ నేతలు రాజకీయ విమర్శలు చేయటం రైతుల్లో అనుమానాలు రేకెత్తిస్తుంది. సీఎం కోరినట్లు జరిగితే టీడీపీ నేతలు తప్పుపట్టటం ఎందుకు అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.

Also Read : వరదాపురం సూరి మళ్లీ టీడీపీలోకి?పరిటాల కుటుంబం ఒప్పుకుంటుందా?

చంద్రబాబు సీఎం గా ఉన్న 1995-2004 మధ్య హంద్రీ-నీవా పనులు మొదలు పెట్టకుండా నిర్లక్ష్యం చేసి,వైయస్సార్ మొదలు పెట్టి పనులు వేగంగా జరిపించటంతో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తొలిసారి హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణ జలాలు అనంతపురం జిల్లాలో ప్రవహించి జీడిపల్లి రిజర్వాయర్ కు చేరాయి. 210 కిమీ పొడువునా కాలువ వెంట నాటి మంత్రి రఘువీరారెడ్డి పాదయాత్ర కూడా చేశాడు .

2014లో మరోసారి సీఎం అయినా చంద్రబాబు హంద్రీ-నీవా పనులను వేగవంతం చేయకుండా మరోసారి నిర్లక్ష్యం చేశాడు . రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలు పెట్టిన గొల్లపల్లి రిజర్వాయర్ పనులు మాత్రమే 2014-2019 మధ్య పూరయ్యాయి.. పేరుకు వేల కోట్ల పనులు ప్రకటించారు కానీ ఏ ఒక్క పని మొదలు కాలేదు .

జగన్ సీఎం అయినా తరువాత హంద్రీ నీవా కాలువను వెడల్పు చేసి 3250 క్యూసెక్కుల కెపాసిటీని 6000 క్యూసెక్కులకు పెంచే ప్రతిపాదనలు చేశారు.. ఈ వాస్తవాలు తెలిసి కూడా టీడీపీ నేతలు హంద్రీ-నీవా పేరుతొ రాజకీయం చేయటానికి చేసిన ప్రయత్నం ఇరు వర్గాల కొట్లాటతో విఫలమయ్యింది.

Also Read:ఫిరాయింపుల్లో ఒక్కో పార్టీది ఒక్కో పద్దతి