iDreamPost
android-app
ios-app

‘ఇప్పటికైనా తెలుసు కో బాబూ ‘

‘ఇప్పటికైనా తెలుసు కో బాబూ ‘

రాజకీయాలలో సీనియర్‌ను అని చెప్పుకునే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచించారు. నెల్లూరులో జరిగిన విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. మంగళవారం నాటి వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమానికి అనుహ్య స్పందన లభించిందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే భరోసా కింద సాయం అందించారని అన్నారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలన్నింటినీ నేరవేరుస్తుండటంతో చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రుణ మాఫీ అని చెప్పి రైతులను చంద్రబాబు మోసం చేశారని, రైతుల పేరుతో పనులు చేపట్టి టీడీపీ నేతలు కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు. నెల్లూరు బ్యారేజీలను ఐదేళ్ల కాలంలో పూర్తి చేస్తామన్న టీడీపీ ప్రభుత్వం దానిని పూర్తి చేయకుండా టీడీపీ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు.