ఇటీవలే పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్ కిచ్లూ మొదటి డిజిటల్ డెబ్యూ ‘లైవ్ టెలికాస్ట్’ నిన్న డిస్నీ హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తం ఏడు ఎపిసోడ్లతో సుమారు మూడున్నర గంటల నిడివి ఉన్న ఈ వెబ్ సిరీస్ కు కోలీవుడ్ విలక్షణ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్టర్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అజిత్ గ్యాంబ్లర్ తీసిన వ్యక్తి అవ్వడం వల్ల దీని గురించి ఆయన ప్లస్ హీరోయిన్ అభిమానులు చాలా నమ్మకం పెట్టుకున్నారు. అందులోనూ ట్రైలర్ చూశాక ఇదేదో డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ అనే నమ్మకం కలగడంతో రెస్పాన్స్ బాగానే ఉంది. మరి వాళ్ళను మెప్పించేలా సాగిందా లేదా సింపుల్ రివ్యూలో చూసేద్దాం.
జెన్నిఫర్(కాజల్ అగర్వాల్)టిఆర్పి రేటింగ్స్ కోసం దేనికైనా సిద్ధమయ్యే ఓ ఛానల్ లో పని చేస్తూ ఉంటుంది. డార్క్ టేల్స్ అనే పేరుతో ఓ కార్యక్రమం నడుపుతూ ఉంటుంది. దెయ్యాల అనుభవాలు ఉన్న వాళ్ళను పిలిపించి నిజ జీవితంలో వాళ్ళు ఎదురుకున్న సంఘటనలను చెప్పించి జనాన్ని భయపెట్టే ప్రయత్నమన్న మాట. మరోవైపు ఒక పెద్ద తార యాంకరింగ్ చేస్తున్న మరొక పోటీ ప్రోగ్రాం వల్ల ఈ షోకు ముప్పు ఏర్పడుతుంది. దీంతో దాన్ని ఎదురుకోవడం కోసం జెన్నిఫర్ మాస్టర్ స్కెచ్ వేస్తుంది. నిజంగానే దెయ్యాల ఇంట్లోకి వెళ్లి అక్కడి లైవ్ గా అనుభవాలను చూపిస్తే ఎలా ఉంటుందన్న ప్లాన్ తో టీమ్ తో అక్కడికి వెళ్తుంది. ఆ తర్వాత జరిగేదే అసలు కథ.
చదవగానే మీకు లారెన్స్ అప్పుడెప్పుడో తీసిన కాంచన గుర్తుకు వస్తే అది మీ తప్పదు కాదు. ఎందుకంటే నిజంగానే ఈ లైన్ అక్కడి నుంచి ఎత్తుకొచ్చారు. అరిగిపోయిన పాత చింతకాయ పచ్చడి లాంటి స్టోరీని వెంకట్ ప్రభు ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పోనీ అదైనా ఆసక్తికరంగా మలిచారా అంటే అదీ లేదు. అవుట్ డేటెడ్ సీన్లతో, సాగదీసిన నెరేషన్ తో ఓపికకు పరీక్ష పెట్టారు. అర్థం లేని తిక్క సన్నివేశాలు అడుగడుగునా కనిపిస్తాయి. కాజల్ తన యాక్టింగ్ తో నిలబెట్టిందా అంటే అదీ లేదు. వైభవ్, ప్రియాంకా, ఆనంది, డేనియల్, సుబ్బు పంచు అరుణాచలం తదితరులు ఇతర పాత్రలు పోషించిన లైవ్ టెలికాస్ట్ మీద మీ సమయం విలువైనది అనుకుంటే ఖర్చు పెట్టకపోవడం మంచిది