iDreamPost
android-app
ios-app

కాజల్ అగర్వాల్ పెళ్లి : వరుడు, డేట్ ఖరారు

  • Published Oct 06, 2020 | 6:52 AM Updated Updated Oct 06, 2020 | 6:52 AM
కాజల్ అగర్వాల్ పెళ్లి : వరుడు, డేట్ ఖరారు

2007లో లక్ష్మికళ్యాణంతో టాలీవుడ్ కు పరిచయమైన కాజల్ అగర్వాల్ 13 ఏళ్ళ తర్వాత పెళ్లి కూతురు కాబోతోంది. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని ఈ నెల అంటే అక్టోబర్ 30న వివాహం చేసుకోబోతోంది. ఈమేరకు తన అధికారిక ట్విట్టర్ ఎకౌంటులో ప్రకటించింది. తనకు కెరీర్లో ఎంతో మద్దతు ఇచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ కాజల్ ఈ అనౌన్స్ మెంట్ చేసింది. కాజల్, గౌతంల మధ్య స్నేహం ఇప్పటిది కాదు. పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి కనిపించినప్పటికీ మూడు ముళ్ళ దాకా ఈ బంధం వెళ్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. వెన్యు తదితర డీటెయిల్స్ ని కాజల్ షేర్ చేయలేదు కానీ విశ్వసనీయ సమచారం మేరకు ముంబై చర్చ్ గేటు దగ్గర ఉన్న ఒక ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్ లో పరిమిత అతిధుల మధ్య రెండు రోజుల పాటు ఈ వేడుక జరగనున్నట్టు తెలిసింది.

ఇక గౌతం విషయానికి వస్తే క్యాతెడ్రల్ అండ్ జాన్ కెనాన్ స్కూల్ లో చదువుకున్న ఇతను ఉన్నత విద్యను టఫ్ట్ యూనివర్సిటీలో పూర్తి చేశాడు. ఫ్యాబ్ ఫర్నిష్ కు వైస్ ప్రెసిడెంట్ గా చేశాక లైఫ్ స్టైల్ బ్రాండ్-ది ఎలిఫెంట్ కంపెనీకి సిఈఓగా ఉన్నాడు. బ్యాక్ గ్రౌండ్ పరంగానూ గౌతం చాలా బలమైన నేపధ్యం కలిగినవాడే. వీళ్ళిద్దరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాజల్ కు అప్పుడే పెళ్ళా అని అభిమానులు పోస్టులు పెట్టుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ చెల్లి నిషాకు గతంలోనే వివాహమయ్యింది. సంతానం కూడా ఉంది. అక్కయ్యదే లేట్ మ్యారేజ్ అని చెప్పాలి. అయితే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదు కాబట్టి కోవిడ్ నిబంధనలు అనుసరించి ఇండస్ట్రీ నుంచి కూడా తక్కువ శాతం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

కాజల్ ప్రస్తుతం మంచు విష్ణు మోసగాళ్ళు పూర్తి చేసి చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2, బాలీవుడ్ మూవీ ముంబై సాగా బాలన్స్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఎప్పుడో ఫస్ట్ కాపీ రెడీ అయిన క్వీన్ తమిళ రీమేక్ పారిస్ పారిస్ ఆర్థిక ఇబ్బందుల వల్ల రిలీజ్ ఆగిపోయింది. ఇవి కాకుండా మరికొన్ని కథా చర్చల్లో ఉన్నాయి. సో ఇకపై వచ్చే ఈ సినిమాలు అన్నింటిలోనూ మిసెస్ కాజల్ అగర్వాల్ అని వస్తుందన్న మాట. ఏదైతేనెం మొత్తానికి మంచి శుభవార్తనే కాజల్ పంచుకుంది. లాక్ డౌన్ టైం నుంచి నిఖిల్, రానా, నితిన్ ఇలా అందరూ హీరోలే పెళ్లి చేసుకుంటున్న టైంలో ఓ హీరొయిన్ ఫంక్షన్ జరగబోతోంది. ఇంకో పాతిక రోజుల్లో ఆ ఘడియలు వచ్చేస్తాయి. సౌత్ వాళ్ళ కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ లాంటిది ఏదైనా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.