iDreamPost
iDreamPost
పరిషత్ ఎన్నికల్లో జనసేన ఉనికి చాటిన జడ్పీటీసీ సీటు చేజారింది. రాష్ట్రంలో 650 పైబడిన స్థానాలకు ఎన్నికలు జరిగితే జనసేనకి దక్కింది కేవలం రెండే సీట్లు. అందులో ఒకటి పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం కాగా రెండోది కడియం. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ లో జనసేన కి దక్కిన ఏకైక సీటు అది. కానీ తీరా ఫలితాలు విడుదలయ్యి పక్షం రోజులు గడవకముందే ఇప్పుడా సీటు కూడా కోల్పోవాల్సి వచ్చింది.
ఇప్పటికే కడియం సర్పంచ్ గా ఉన్న ఆమ్మాణి ఏడుకొండలు జడ్పీటీసీ గానూ గెలిచారు. తొలుత జిల్లాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గంలో నామినేషన్ వేసినప్పటికి ఆ ఎన్నికలు వాయిదా పడడంతో ఆమె సర్పంచ్ గా బరిలో దిగి గెలిచారు. ఆమె జనసేన అభ్యర్థిగా బరిలో దిగినా టీడీపీ మద్దతు మూలంగా విజయం దక్కించుకున్నారు. కొంతకాలంగా కడియం సర్పంచ్ హోదాలో ఉన్న ఆమె ఆరు నెలల విరామం తర్వాత వచ్చిన ఫలితాల్లో మరో విజయం ఆమెని వరించింది.
నిబంధనలు ప్రకారం ఏదో ఒక పదవి వదులుకోవాల్సి రావడంతో ఆమె జడ్పీటీసీ పోస్టుకి రాజీనామా చేశారు. సర్పంచ్ గా కొనసాగాలని నిర్ణయించుకోవడంతో జనసేన ఆశలకు గండి పడింది. గెలిచామనే ఆనందం అవిరయ్యింది. దాంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యమైంది. ఇక ఉప ఎన్నికల్లో ఆ సీటుని జనసేన నిలబెట్టుకోవడం కత్తిమీద సాము వంటిదే.
Also Read : అదే జరిగితే ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుంది..?