iDreamPost
iDreamPost
విషయంలో సమ్మెకు సిద్ధపడగా చివరి నిమిషంలో ముఖ్యమంత్రి జోక్యంతో వారి సమస్య పరిష్కారం కావడమే కాకుండా, సంతృప్తిగా విధుల్లో చేరిన విషయం విశేషం.
తాజాగా జూనియర్ డాక్టర్లది కూడా అదే పరిస్థితి. తెలంగాణాలో సమ్మె చేసి స్టైఫండ్ పెంపుదల సాధించిన జూడాలు ఏపీలో కూడా నిరసనకు సిద్ధమయ్యారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో నిరసనలకు పూనుకోవడంతో తెలంగాణా ప్రభుత్వం దిగిరాక తప్పలేదనే అనుభవం ఏపీలోనూ జూడాలను ప్రోత్సాహించినట్టు కనిపిస్తోంది. దానికి అనుగుణంగా సమ్మె నోటీసు ఇచ్చి, ఈరోజు నుంచి విదుల బహిష్కరణకు పూనుకున్నారు.
దాంతో ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. తొలుత వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపినా సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జోక్యం చేసుకున్నారు. సీఎం ఆదేశాలతో ఆయన రంగంలో దిగారు. జూనియర్ డాక్టర్లతో చర్చించారు. మంత్రి ఆళ్ల నానితో చర్చల సందర్భంగా జూడాలకు ఆశ్చర్యపరిచే స్పందన రావడంతో నోరెళ్ల పెట్టాల్సి వచ్చింది. వాస్తవానికి జూడాలు తమ ప్రధాన డిమాండ్ కి స్టైఫండ్ 15 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి జగన్ దానికి మించి పెంపుదల చేసే యోచనలో ఉన్నారని ఆరోగ్యశాఖ మంత్రి చెప్పడంతో జూడాలు విస్తుపోయారు.
త్వరలోనే సీఎంతో దీనిపై చర్చించి, తుది ప్రకటన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దాంతో జూడాలు గతంలో అనేక ప్రభుత్వాలు తాము పెట్టిన డిమాండ్ పై బేరాలకు దిగగా, ఈసారి దానికి భిన్నంగా తాము కోరిన దానికన్నా ఎక్కువ పెంచుతామని చెప్పిన ప్రభుత్వ తీరుతో సంతృప్తి చెందారు. కరోనా సమయంలో విశేషంగా సేవలందిస్తున్న వారి శ్రమను గౌరవిస్తామని, వారికి ఆర్థిక భరోసా కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలతో తిరిగి విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. మొత్తంగా సీఎం స్పందించిన తీరు వారిని ఆశ్చర్యపరిచిందనడంలో సందేహం లేదు.