iDreamPost
android-app
ios-app

భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్..

భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్..

అరుదైన రికార్డు సాధించిన జో రూట్..

చెన్నై చెపాక్ స్టేడియంలో టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తుంది. ఇంగ్లాండ్‌ బ్యాట్స్మెన్ ను కట్టడి చేయడానికి భారత బౌలర్లు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్‌స్టోక్స్(63, 98 బంతుల్లో 9×4,2×6),సారథి జో రూట్(156,277 బంతుల్లో 16×4,1×6)పూర్తి సంయమనంతో ఆడుతూ భారత బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు.

శనివారం 263/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టును సారథి జో రూట్ ముందుండి నడిపించగా బెన్‌స్టోక్స్ అర్ధ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో జో రూట్ 150 పరుగులు సాధించిన వరుసగా మూడు టెస్టుల్లో 150 పరుగులు సాధించిన వారి సరసన నిలిచాడు. గతంలో శ్రీలంక వికెట్ కీపర్ కుమార సంగక్కర నాలుగు వరుస టెస్టుల్లో 150+ స్కోర్లు సాధించి రికార్డు నెలకొల్పగా వాలీ హామండ్, డాన్‌ బ్రాడ్‌మన్, జహీర్ అబ్బాస్, ముదస్సర్ నాజర్, టామ్ లాథమ్ లు వరుసగా జో రూట్ కంటే ముందుగా మూడు టెస్టుల్లో 150 + స్కోర్లు సాధించారు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో వరుసగా రెండు టెస్టుల్లో 150+ స్కోర్ చేసిన జో రూట్ భారత్ తో జరుగుతున్న టెస్టులో 150 స్కోర్ చేసి వారి సరసన చేరాడు. అంతేకాకుండా వరుసగా 98, 99, 100 టెస్టుల్లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

జో రూట్,బెన్‌స్టోక్స్ ధాటిగా బ్యాటింగ్ చేస్తుండడంతో లంచ్ సమయానికి 119 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 355 పరుగులు సాధించి భారీ స్కోరు దిశగా పయనిస్తుంది. భారత బౌలర్లు ఎంత ఇంగ్లండ్ జట్టును త్వరగా కట్టడి చేస్తే భారత విజయావకాశాలు అంతగా పెరుగుతాయి.