iDreamPost
android-app
ios-app

విజయానికి ఆరు అడుగుల దూరంలో జో బైడెన్…!

  • Published Nov 05, 2020 | 1:51 AM Updated Updated Nov 05, 2020 | 1:51 AM
విజయానికి ఆరు అడుగుల  దూరంలో జో బైడెన్…!

అత్యంత ఉత్కంఠత రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నిక కౌంటింగ్ 24 గంటల తరువాత కూడా కొనసాగుతుంది. కానీ తుది ఫలితం మీద ఒక స్పష్టత వచ్చింది.

ప్రస్తుతం అలాస్కా,నెవడా ,పెన్సెల్‌వేనియా,నార్త్ కరోలినా,జార్జియా రాష్ట్రాలలో కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు డెమొక్రాట్ అభ్యర్ధీ జో బైడెన్ 264 ఓట్లతో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ 214 ఎలెక్ట్రోల్ ఓట్లు సాధించారు. అధక్ష పదవికి కావలసిన మ్యాజిక్ నెంబర్ 270 కి జో బైడిన్ 6 ఓట్ల దూరంలో ఉన్నాడు.

ఆరు ఎలెక్ట్రోల్ ఓట్లు ఉన్న నెవడాలో జో బైడెన్ 8000 ఓట్ల ఆధిక్యతలో ఉన్నాడు. ఇక్కడ 75% కౌంటింగ్ పూర్తయ్యింది. నెవాడాలో డెమొక్రాట్ పార్టీకి మద్దతు ఇస్తున్న రాష్ట్రం. మెజారిటీ తక్కువగా ఉన్నా కౌంటింగ్ మొదటి నుంచి జో బైడెన్ ఆధిక్యతలో కొనసాగుతుండటంతో నెవడా లో జో బైడెన్ గెలుస్తాడని అమెరికా మీడియా అంచనా వేసింది.. అదే జరిగితే మిగిలిన రాష్ట్రాల ఫలితాలతో సంబంధం లేకుండా జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లే.

Also Read:అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఏమి జరుగుతుంది?

కౌంటింగ్ మొదలయిన తరువాత మొదటి 12 గంటల వరకు ట్రంప్ లీడింగ్లో ఉన్న విస్కాన్సిన్ మరియు మిచిగాన్ రాష్ట్రాలలో జో బైడెన్ గెలవటంతో ఒకరకంగా ఈ ఎన్నికల ఫలితం వచ్చినట్లు అయ్యింది.

ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతున్నా పెన్సెల్‌వేనియాలో 88% కౌంటింగ్ పూరయ్యేసరికి ట్రంప్ రెండు లక్షల మెజారిటీతో ఉన్నాడు కానీ తుది ఫలితం తనకు అనుకూలంగా ఉంటుందన్న ధీమాలేదు.ఒక దశలో 7.5 లక్షల ఓట్ల ఆధిక్యతలో ఉన్న ట్రంప్ మెజారిటీ ఇప్పుడు 1.90 లక్షలకు తగ్గటం గమనార్హం.

నాలుగు లక్షలకు పైగా ఓట్లు ఉన్న ఫిలిడెల్ఫియా డిస్ట్రిక్ట్ లో జో బైడెన్ కు వచ్చే మెజారిటీ మొత్తం పెన్సెల్‌వేనియా రాష్ట్రం మెజారిటీని జో బైడెన్ కు అనుకూలంగా మార్చవచ్చు.

ట్రంప్ కు కాస్త ఎక్కువ ఆశలు ఉన్నది నార్త్ కరోలినా మీదనే. ఇక్కడ 94% కౌంటింగ్ పూర్తయ్యేసరికి ట్రంప్ 77000 ఆధిక్యతలో ఉన్నాడు.

Also Read:కార‌ణ‌మిదే..! ఎన్నిక‌లంటే ఉద్యోగుల్లో ఆందోళ‌న

కౌంటింగ్ కొనసాగుతున్న చివరి రాష్ట్రం జార్జియా. ఇక్కడ ప్రస్తుతం 98% కౌంటింగ్ తరువాత ట్రంప్ 37,000 మెజారిటీతో ఉన్నాడు.ఈ రాష్ట్రంలో ఒక దశలో ట్రంప్ మూడు లక్షల ఆధిక్యతలో ఉన్నాడు. క్రమంగా జో బైడిన్ పుంజుకున్నాడు.

జార్జియాలోని ఫుల్టన్ మరియు డికాల్ప్ కౌంటీలలో సుమారు రెండున్నర లక్షల ఓట్లు కౌంట్ చేయవలసి ఉంది.వీటిలో డెమొక్రాట్ ఓట్లు ఎక్కువ.తన మెజారిటీ 60,000 కన్నా దిగువకు పడిపోగానే కౌంటింగ్ ఆపమని ట్రంప్ కోర్ట్ కు వెళ్ళాడు.. తుది ఫలితం ట్రంప్ కు వ్యతిరేకంగానే ఉండవచ్చు.

మొత్తంగా ట్రంప్ కు అలాస్కాలోని 3,నార్త్ కరోలినాలోని 15 కలిపి మొత్తంగా 232 ఓట్లు ఖాయం అనుకున్నా జో బైడెన్ కు నెవాడా లోని ఆరు ఓట్లతోనే 270 ఓట్లమ్యాజిక్ నంబర్ ను చేరుకుంటాడు..

కౌంటింగ్ మొత్తం పూర్తయ్యేసరికి మరో మూడు,నాలుగు రోజులు పట్టొచ్చు. కానీ తదుపరి అధక్షుడి ఎవరో మరో 15 నుంచి 20 గంటలలోనే తేలిపోతుంది. ట్రంప్ కోర్ట్ కేసులు ఫలితాన్ని మార్చే పరిస్థితి లేదు.

వివిధ మీడియాలు చూపుతున్న ఫలితాలు వారు ప్రకటిస్తున్నవే. మూడు నాలుగు రాష్ట్రాలు తప్ప అనేక రాష్ట్రాల ఎన్నికల సంఘాలు ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సిఉంది.