iDreamPost
iDreamPost
నాలుగురోజులుగా కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠతకు తెరపడింది. డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడన్ 284 ఎలెక్ట్రోల్ వోట్లు సాధించినట్లు పలు మీడియా సంస్థలు ప్రకటించగా,మరి కొన్ని సంస్థలు 273 ఎలెక్ట్రోల్ వోట్లు సాధించినట్లు ప్రకటించాయి. అధ్యక్షడిగా ఎన్నిక కావటానికి 270 ఎలెక్ట్రోల్ వోట్లు కలసి ఉండగా జో బైడన్ ఆ మార్కు దాటాడు.. ప్రకటితంగా గెలిచినట్లే.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాల అధికారులు ప్రకటించాలి,అధికారిక ప్రకటనకు కొంత సమయం పడుతుంది. కానీ ఇరు పక్షాలకు అనుకూలంగా ఉండే మీడియా పెన్సిల్వేనియా ఫలితాన్ని ప్రకటించటంతో జో బైడన్ గెలిచినట్లే.ఇక్కడ 99% కౌంటింగ్ జరగ్గా జో బైడన్ 37,000 అధిపత్యంలో ఉన్నాడు,మరో 50,000 వోట్లు లెక్కించవలసివుంది.
Also Read:అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఏమి జరుగుతుంది?
ఏదైనా రాష్ట్రంలో ఇరు అభ్యర్థుల మధ్య ఓట్ల వ్యత్యాసం 0.5 శాతం కన్నా తక్కువ ఉంటే రీ-కౌంటింగ్ కోరవచ్చు. జార్జియాలో జో బైడన్ ట్రంప్ మధ్య 0.2 % మాత్రమే తేడా ఉంది. పెన్సిల్వేనియాలో బైడన్ గెలుపుతో జార్జియా రీ-కౌంటింగ్ కు ఎలాంటి ప్రాధాన్యతా ఉండదు. ట్రంప్ పార్టీ అయిన రిపబ్లిక్ పార్టీలో కూడా రీకౌంటింగ్ కు మద్దతు దక్కటం లేదు. కోర్టు కేసులు ,రీ -కౌంటింగ్ వలన డబ్బు ,సమయం వృధా తప్ప ఫలితం ఉండదన్న అభిప్రాయం ఉంది.
88% మాత్రమే కౌంటింగ్ జరిగిన నెవడా రాష్ట్రంలో కూడా బైడన్ గెలిచినట్లు దాదాపు అన్ని సంస్థలు ప్రకటించాయి. నెవడా సాంప్రదాయకంగా డెమొక్రటిక్ పార్టీకి మద్దతు ఇస్తున్న రాష్ట్రం. ఇక్కడ తేడా తక్కువగా ఉన్నా మొదటి నుంచి జో బైడాన్ ఆధిపత్యం చూపిస్తున్నారు . ప్రస్తుతం 26 వేల ఓట్ల మెజారిటీతో జో బైడన్ ముందున్నారు.
Also Read: కాక రేపుతున్న బీహార్ ఎగ్జిట్ పోల్స్…
అరిజోనా విషయంలో భిన్న అభిప్రాయలు ఉన్నాయి. అరిజోనా సాంప్రదాయక రిపబ్లిక్ రాష్ట్రం కాని ఈ ఎన్నికల కౌంటింగ్ మొదటి నుంచి డెమొక్రాట్ జో బైడన్కు మెజారిటీ వస్తుంది కానీ అది క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 90% కౌంటింగ్ పూర్తయిన తరువాత జో బైడన్ 20వేల మెజారిటీతో ఉన్నాడు.
కౌంటింగ్ కొనసాగుతున్న అలస్కా , నార్త్ కరోలినా రాష్ట్రాలలో ట్రంప్ గెలుస్తాడు. ఈ రెండు రాష్ట్రాలలో కలిపి 18 ఎలెక్ట్రోల్ ఓట్లు ఉన్నాయి, ఇవి కలిపినా కూడా ట్రంప్ 232 వోట్ల వద్ద ఆగిపోతాడు. నెవడ,పెన్సుల్వేనియా కలిపి జో బైడన్ కు 273, అరిజోనా కలిపి 284 ఓట్లు దక్కుతాయి. జార్జియా కూడా కలిపితే 306 ఎలక్ట్రోల్ వోట్లు జో బైడన్కు రావచ్చు.. గత ఎన్నికల్లో ట్రంప్ కు 306 ఓట్లు రావటం గమనార్హం..
తుదిఫలితం ప్రకటన ఆలస్యం కావచ్చు కానీ జో బైడనే తదుపరి అమెరికా అధ్యక్షుడు..