iDreamPost
android-app
ios-app

లాభాల రత్నాలు – ముగింపు వసూళ్లు

  • Published Apr 09, 2021 | 7:01 PM Updated Updated Apr 09, 2021 | 7:01 PM
లాభాల రత్నాలు – ముగింపు వసూళ్లు

2021లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ సరసన చోటు దక్కించుకున్న జాతిరత్నాలు ఫైనల్ రన్ పూర్తి చేసుకున్నట్టే. కొన్ని ముఖ్యమైన సెంటర్లు తప్పించి అన్ని చోట్ల గుడ్ బై అందుకుంది. కేవలం రెండు వారాల్లోనే డబుల్ ప్రాఫిట్స్ ఇచ్చి బయ్యర్లు ఆశ్చర్యపోయేలా వసూళ్లు సాధించిన తీరు చూసి స్టార్లు సైతం షాక్ అయ్యారు. తక్కువ బడ్జెట్, క్వాలిటీ మేకింగ్, ట్రెండీ మ్యూజిక్, టాలెంటెడ్ క్యాస్టింగ్ వెరసి జాతిరత్నాలు రూపంలో స్వప్న సినిమా సంస్థకు మరో ఘన విజయం ఖాతాలో చేరింది. మూడో వారం నుంచి బాగా నెమ్మదించిన ఈ సినిమా నిన్న థియేటర్లలో వకీల్ సాబ్ ఎంట్రీతో కంప్లీట్ గా సైడ్ అవ్వక తప్పలేదు. అప్పటికే తన ముద్ర బలంగా వేసింది.

వివిధ సోర్సెస్ నుంచి వచ్చిన సమాచారం మేరకు జాతిరత్నాలు సుమారు 38 కోట్ల 52 లక్షల షేర్ సాధించి చిన్న సినిమాల్లో పెద్ద రికార్డు సృష్టించింది. విడుదలకు ముందు దీనికి జరిగిన బిజినెస్ కేవలం 11 కోట్లే. అప్పుడు అదే పెద్ద మొత్తం అనుకున్నారు. దానికి నాలుగింతలు ఎక్కువ షేర్ రావడం అనేది ఎవరి ఊహకూ అందనిది. ముఖ్యంగా నైజామ్ ని తన కంట్రోల్ లో తీసుకున్న జాతిరత్నాలు ఆ ఒక్క ఏరియా నుంచి ఏకంగా 16 కోట్లు రాబట్టి సంచలనం రేపింది. ఈ మొత్తం శ్రీకారం వరల్డ్ వైడ్ షేర్ కన్నా ఎక్కువ కావడం గమనార్హం.ఆ రేంజ్ లో ఊచకోత సాగింది. ఇక వసూళ్ల లెక్కలు చూస్తే

జాతిరత్నాలు ఫుల్ రన్ వసూళ్లు:

ఏరియా  షేర్ 
నైజాం  16cr
సీడెడ్  4.27cr
ఉత్తరాంధ్ర  3.97cr
గుంటూరు  2.08cr
క్రిష్ణ  1.85cr
ఈస్ట్ గోదావరి  1.92cr
వెస్ట్ గోదావరి  1.52cr
నెల్లూరు  0.91cr
ఆంధ్ర+తెలంగాణా  35.52cr
రెస్ట్ అఫ్ ఇండియా 1.72cr
ఓవర్సీస్  4.28cr
ప్రపంచవ్యాప్తంగా 38.52cr

అఫీషియల్ డేట్ రేపే అయినప్పటికీ జాతిరత్నాలు ఇవాళ రాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. నెల రోజులకే నిర్మాతలు అగ్రిమెంట్ చేసుకోవడంతో ఆ మేరకు డేట్ ని లాక్ చేశారు. ఎలాగూ వకీల్ సాబ్ హవా మొదలైపోయి మిగిలినవాటికి అవకాశం తగ్గిపోయింది కాబట్టి జాతిరత్నాలుకు అన్ని కోణాల్లో టైం కలిసి వచ్చింది. డిజిటల్ లోనూ వ్యూస్ పరంగా భారీ సంచలనాలు నమోదు చేయడం ఖాయం. ఒక్క దెబ్బతో నవీన్ పోలిశెట్టి, దర్శకుడు అనుదీప్ లను మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేరిపోయిన జాతిరత్నాలు ఇకపై ఆన్ లైన్లో ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు ఎంజాయ్ చేయొచ్చు.

Verdict: Block Buster