iDreamPost
android-app
ios-app

జాతిని నవ్వించే పనిలో రత్నాలు

  • Published Mar 04, 2021 | 11:40 AM Updated Updated Mar 04, 2021 | 11:40 AM
జాతిని నవ్వించే పనిలో రత్నాలు

రెండేళ్ల క్రితం 2019లో సోలో హీరోగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో పెద్ద హిట్టు అందుకున్న నవీన్ పోలిశెట్టి ఆ తర్వాత హిందీలో చిచోరేలో మాత్రమే కనిపించాడు. ఆ టైంలో సైన్ చేసిన సినిమానే జాతి రత్నాలు. లాక్ డౌన్ వల్ల విడుదల ఆలస్యమవుతూ వచ్చిన ఈ చిత్రం నిర్మాత నాగ అశ్విన్ కావడంతో అంచనాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అందులోనూ వైజయంతి మూవీస్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ కు సిస్టర్ కన్సర్న్ లాంటి స్వప్న సినిమా పతాకంపై ఇది రూపొందటంతో మెల్లగా హైప్ పెరుగుతోంది. దీనికి తోడు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ టైటిల్ రోల్ లో మిగిలిన రెండు పాత్రలు పోషించడంతో కామెడీ లవర్స్ దీన్నుంచి చాలా ఆశిస్తున్నారు.

ఇందాకే డార్లింగ్ ప్రభాస్ ద్వారా ఆన్ లైన్ లో ట్రైలర్ ని విడుదల చేశారు. లేడీస్ ఎంపోరియం నడుపుతున్న ముగ్గురు స్నేహితులకు బయటికి ఆ విషయం చెప్పుకోవడం అంటే మహా ప్రెస్టిజి. అందుకే అది దాచిపెట్టి అమ్మాయి ప్రేమ కోసం నానా తిప్పలు పడుతూ ఉంటారు. అయితే సరదాగా గడిచిపోతున్న వీళ్ళ జీవితంలో పెద్ద ట్విస్టులు వచ్చి పడతాయి. ఆఖరికి జైలుకు కూడా వెళ్తారు. జడ్జ్ సైతం వీళ్ళ కామెడీ టైమింగ్ కి సరదా పడతాడు. అసలు ఈ ట్రయాంగిల్ ఫ్రెండ్ షిప్ స్టోరీలో ఏమేం జరిగింది. వీళ్ళ లైఫ్ ఎక్కడి దాకా వెళ్ళింది చూడాలంటె మార్చి 11న విడుదలయ్యే థియేటర్లకే వెళ్ళాలి

వీడియో చూస్తుంటే మంచి ఎంటర్ టైనింగ్ గా దర్శకుడు కెవి అనుదీప్ దీన్ని రూపొందించినట్టు కనిపిస్తోంది. ప్రతి సీన్ లోనూ ఏదో ఒక జోక్ ఉండేలా చూసుకున్నారు. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి మరోసారి తమ టైమింగ్ తో ఆడుకున్నాడు. రాహుల్, ప్రియదర్శి ఇద్దరినీ డామినేట్ చేశాడు. బడ్జెట్ మీడియం అనిపించినా ఇందులో పెద్ద క్యాస్టింగ్ ఉంది. సీనియర్ నరేష్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, మురళి శర్మ ఇలా గ్యాంగ్ భారీగా ఉంది. హీరోయిన్ ఫరియా సహజంగా మెప్పించింది. రదన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సిద్ధం మనోహర్ ఛాయాగ్రహణం సెటప్ కు తగ్గట్టు చక్కగా ఉన్నాయి. ట్రైలర్ తో జాతిరత్నాల అంచనాలు పెరిగాయి.

Trailer Link @ http://bit.ly/3qgFCuP