జమ్మూకశ్మీర్ రాష్ట్రం గురువారం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. దీంతో అవిభక్త రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. గుజరాత్‌కు చెందిన మాజీ బ్యూరోక్రాట్ గిరీశ్ చంద్ర ముర్ము జమ్మూకశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా, సీనియర్ ఐఏఎస్ రాధాకృష్ణ మాధుర్ లద్దాఖ్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణం చేశారు. జమ్మూ కశ్మీరు విభజనపై పొరుగు దేశం చైనా అభ్యంతరం తెలిపింది. కశ్మీర్ తమ అంతర్గత వ్యవహారమంటూ భారత్ ఘాటుగా స్పందించింది.