నోటికి తోచింది మాట్లాడడం, ఒక విషయం వద్ద మొదలు పెట్టి మరో విషయం లోకి వెళ్లడం, ఉద్యమ సమావేశాల్లో వ్యక్తిగత విమర్శలు చేయడం చంద్రబాబుకు చేతనైన పని అయితే… ఒక ఉద్యమాన్ని సరైన దిశలో నిర్మించడం, ఒక సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గాలను చూపించడం నాయకుడి లక్షణం. సరిగ్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే చేస్తున్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్తున్న కేంద్రం ముందు సీఎం హోదాలో ఆయన పెడుతున్న ప్రత్తిపాదనలు మేధావులతో సైతం శభాష్ అనిపించుకుంటున్నాయి.బుధవారం విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ముక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులతో గంటకు పైగా భేటీ అయ్యారు. ఇక్కడ సీఎం జగన్ లేవనెత్తిన అంశాలు, కేంద్రం మీద ఎలా పోరాడాలి అన్న దిశానిర్దేశం సంఘం ప్రతినిధులు సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది.
స్పష్టంగా… సూటిగా!
విశాఖ ఉక్కు పరిశ్రమ అనేది ఆంధ్ర ప్రదేశ్ ఆత్మగౌరవం. దీనిని ప్రైవేటీకరించడం నికి రాష్ట్రప్రభుత్వం ఒప్పుకోదు అని స్పష్టం చేసిన జగన్ దీనిపై శాసనసభలో సైతం తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామని సంఘం ప్రతినిధులకు చెప్పారు. అంతే కాదు.. రాజకీయాలను పక్కన పెట్టి అందరం కలిసి ఢిల్లీ పెద్దలను పరిశ్రమకు సానుకూలంగా మార్చాలని, దానికి తగిన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
భూముల విషయం ఇలా చేద్దాం!
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తే నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ భూములను చూసి ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉందని దీనిని అడ్డుకోవాలని జగన్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ కు దాదాపు 20 వేల ఎకరాల భూములు ఉన్నాయని కేవలం ఏడు వేల ఎకరాలు మాత్రమే ఇప్పటివరకూ ఉపయోగించారని జగన్ లెక్కలతో సహా చెప్పారు. మిగిలిన భూమిని ప్రభుత్వం నుంచి ల్యాండ్ యూత్ కన్వర్షన్ కు అనుమతిస్తామని, ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశం కనుక ఎలాంటి అభ్యంతరం ఉండదని చెప్పారు. ఆ భూములను లే ఓట్లు వేసి స్టీల్ ప్లాంట్ ద్వారానే విక్రయిస్తే, ఆ వచ్చిన డబ్బును స్టీల్ ప్లాంట్ లోనే పెట్టుబడి పెట్టేలా చూద్దామని జగన్ చెప్పడం ఆయన ఉద్యమం మీద ఎంత స్పష్టంగా వున్నారో తెలియజేస్తోంది.
ఒకవేళ స్టీల్ ప్లాంట్ భూములను ప్రభుత్వం కనుక తీసుకుంటే, వేలం లో పాల్గొని ప్రైవేటు కంపెనీలు అంతగా ఆసక్తి చూపవు. అసలే నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు భూములు కూడా లేకపోతే దానిని టేకోవర్ చేసేందుకు ఏ కంపెనీ ముందుకు వచ్చే అవకాశం ఉండదనేది జగన్ ప్లాన్.
ఇప్పటికే విశాఖ ఉక్కును ఎలా కాపాడుకోవచ్చన్న విషయంలో కేంద్రానికి స్పష్టమైన సూచనలు చేస్తూ లేఖ రాసిన జగన్, పరిశ్రమ ప్రైవేటు వారికి చెందకుండా చేసేలా అన్ని దారులను వెతుకుతున్నట్లు అర్థమవుతోందని పరిరక్షణ సంఘం ప్రతినిధులు సైతం బేటీ మీద ఆనందం వ్యక్తం చేశారు.
చంద్రబాబు మాట నమ్మే పరిస్థితి లేదు!
విశాఖ ఉక్కు ఉద్యమం మీద కన్నేసి, కల్లబొల్లి మాటలతో హైజాక్ చేయాలని చూస్తున్న మాటలకు ముఖ్యమంత్రి మాటలకు పూర్తి భిన్నత ఉందని ముక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు చెప్పడం విశేషం. సీఎం చెప్పిన విషయాలు సహేతుకంగా ఉన్నాయని, ఒక దిశా నిర్దేశం లో ఆయన ఆలోచనలు సాగుతున్నాయని పరిశ్రమను కాపాడుకోవడానికి ఆయన కంకణబద్ధులై ఉన్నారని కనిపిస్తోందని సంఘం ప్రతినిధులు సీఎం హామీ ల మీద ఆనందం వ్యక్తం చేశారు.