iDreamPost
android-app
ios-app

ఒంటరిగా వెళ్ళాడు , ఒక్కడిగా గెలిచాడు @జగన్

  • Published May 30, 2020 | 1:52 AM Updated Updated May 30, 2020 | 1:52 AM
ఒంటరిగా వెళ్ళాడు , ఒక్కడిగా గెలిచాడు @జగన్

తెల్లని కిరణం చూడటానికి తెల్లగా కనిపిస్తుoది కానీ పరిశోదించి చూస్తేనే అందులో ఉన్న ఏడు రంగులూ బయటపడతాయి, అలాగే సీఎం జగన్ జీవితం కూడా చూడటానికి సాదారణంగానే కనిపిస్తుంది కానీ పరిశోదించి చూస్తే ఆయన 10ఏళ్ళుగా పడిన కష్టం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది.

2009 లో మొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి కడప పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ ఎంపీగా నెగ్గిన ఆయనకు 100 రోజుల్లోనే తన తండ్రి వై.యస్ రాజశేఖర రెడ్డి గారి మరణంతో జీవన గమనం అనుకోని మలుపు తిరిగింది. ప్రజా నేతగా ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు తన ప్రజా రంజక పాలనతో సంక్షేమ పధకాల ద్వార ఎంతో మేలు చేసిన వ్యక్తి రెప్పపాటులో మాయం అయ్యేసరికి తట్టుకోలేక ఎన్నో గుండెలు ఆగిపోయాయి. దీంతో నల్ల కాలవ సభలో తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిల్లకి వెళ్లి ఓదారుస్తానని మాటిచ్చారు జగన్ . జగన్ నోటి నుండి వచ్చిన ఓదార్పు అనే మాటే తనని రాజకీయ రణ క్షేత్రం లోనికి అడుగుపెట్టేలా చేసింది.

వై.యస్ మరణంతో నిద్రలేచిన కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్ అధ్యక్షురాలైన సోనియా గాంధి చూట్టూ చేరి వెలిగించిన నిప్పు కాంగ్రెస్ అధిష్టానానికి జగన్ కు మధ్య దూరం పెరిగేలా చెసింది. మొదట తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానులను ఓదార్చెందుకు ఒప్పుకున్న కాంగ్రెస్ అధిష్టానం ప్రజల్లో జగన్ కు వస్తున్న మద్దతు చూసిన కొందరు స్థానిక నేతల పిర్యాదులతో కట్టడి చేసే ప్రయత్నం ప్రారంభించింది. అందులో భాగంగా ఓదార్పుని ఆపమని హుకుం జారిచేసింది, దీనితో పాటు కుటుంభాన్ని చీల్చే ప్రయత్నం చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన జగన్ సోనియాకు తన రాజీనామా లేఖను పంపారు. ఆలేఖలో జగన్ అన్న మాట “ఒంటరిని చేయాలనుకున్నారు, ఒంటరిగానే వెలుతున్నాను” ఈ మాటతో ఆనాడు జగన్ నేరుగా డిల్లీనే ఢీ కొట్టడానికి సిద్దపడినట్టు ఇక తనకి రాజకీయ భవిష్యత్తు ఉండదని పలువురు విశ్లేషంచారు.

ఎవరైతే ఒంటరిగా నడవడానికి సిద్ద పడతారో వారికి తమ గమ్యం మీద ఒక నిర్ధిష్టమైన అవగాహన ఉంటుందనే మాటను నిజం చేస్తూ , కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత నేరుగా పోరాటం లోకి దిగిన జగన్ చెప్పిన మాట ” నా వెంట ఎవరు వచ్చిన వారి జీవితం కూడా ముళ్ల బాటే , నాతో పాటు వారికీ కష్టాలు తప్పవు” అని స్పష్టం చేశారు . కడప ఉపఎన్నికల్లో తన బలం నిరూపించుకున్నారు. తన తండ్రి పేరుమీద పార్టీ పెట్టిన జగన్, వైయస్ ప్రవేశ పెట్టిన పధకాలకు కాంగ్రెస్ పార్టీ మంగళం పాడుతుంటే ప్రజలకు అండగా నిలబడి ఎన్నో నిరసనలు చేపట్టారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆ పార్టీ సీనియర్ నేత శంకరరావు , తెలుగుదేశం నేతలు ఎర్రం నాయుడు, బై రెడ్డి రాజశేఖర రెడ్డి చేత ఆరోపణలు చేయిస్తు కోర్టులో కేసులు వేశారు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టి మూకుమ్మడిగా చేసిన ఆరోపణలపై నిజాలు తేల్చాలి అని కోర్టు కేసుని సి.బి.ఐ కు అప్పగించింది.

కోర్టు ఆదేశాలు అంటు రంగంలోకి దిగిన సి.బి.ఐ దివంగత నేత పేరును చార్జ్ షీట్ లో చేర్చడంతో నిరసనగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు 17 మంది రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. అయితే ఎన్నికల ప్రచారం లో జగన్ కు వస్తున్న ప్రజాధరణ ని తట్టుకోలేని కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం చేతిలో పంజరం లో చిలకగా ముద్రపడ్డ సి.బి.ఐ చేత అరెస్టు చేయించి విచారణ పేరుతో 16 నెలలు నిర్బందించగలిగారు. కానీ సుప్రీం కోర్టు జోక్యంతో విడుదల అయ్యారు.

రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో అనుభవం పేరున ముఖ్యమంత్రి పీఠం పై కూర్చున్న చంద్రబాబు తాను మ్యానిఫెస్టోలో ఇచ్చిన 650 హామీలని గాలికి వదిలేసారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రపంచ స్థాయి రాజధాని కట్టబోతునట్టు కల్లబొల్లి కబుర్లు చెప్పుకుంటూ కాలం వెళ్లబుచ్చారు . ఇదేమిటని అడిగిన మహిళలపై లాఠీచార్జి చేయించారు. అక్రమం అన్న రైతన్నలపై పోలీసు కేసులు పెట్టించారు. భూమి ఇవ్వను అన్న వ్యక్తుల పంటలు తగలబెట్టించారు. ఇదేమి అన్యాయం అని అసెంబ్లీ లో నిలదీసిన జగన్ పై నిందలు మోపారు. వారి అనుబంధ మీడియాలో పేపర్లలో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను నిలదీసేవారిని అభివృద్ది నిరోధకులుగా ముద్ర వేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రానికి రావల్సిన ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని అడగకపోగా వారు ఇస్తానన్న ప్యాకేజీనే మహాద్బుతం అని పొగిడి రాష్ట్రానికి రావల్సిన ప్రత్యేక హోదా హక్కును చంపేశారు. దీంతో జగన్ నాడు ప్రతిపక్ష నేత హోదాలో తీసుకున్న ప్రజా సంకల్ప యాత్ర అనే సాహసోపేత నిర్ణయంతో రాష్ట్ర రాజకీయంలో సరికొత్త అద్యాయానికి భీజం పడింది.

ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చేస్తున్న అనైతిక చర్యలను ఎండగడుతూ ప్రభుత్వం వలన మోసపోయిన వర్గాలకు తాను ఉన్నానని హామీ ఇస్తూ ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు సాగిన సుదీర్గ పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. పాదయాత్ర అనంతరం జగిగిన ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎవ్వరికి సాధ్యం కానంత ఘన విజయం సాదించి ప్రజా మద్దతుతో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ప్రమాణశ్వీకారం చేశారు.

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్వీకారం చేసి సరిగ్గా నేటికి ఏడాది పూర్తి అయింది. రాజకీయ రణ క్షేత్రంలో గెలిచిన జగన్ నేడు ముఖ్యమంత్రి గా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉండిపోయేలా ఇచ్చిన హామీ ఇచ్చినట్టుగా , చెప్పిన పని చెప్పినట్టుగా కేవలం 9 నెలల్లోనే 90% హామీలు నెరవేర్చి దేశ రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడూ నిలబెట్టుకోలేని విదంగా తన మాటను నిలబెట్టుకున్నారు. తన పాలనలో తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలతో నేటి రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి బాటలు వేస్తున్నారు. పదేళ్ళు డిల్లీ లీడర్ల దగ్గర నుండి గల్లీ లీడర్ల దాక తాను సాగించిన పోరాటం చూసిన వారికి జగన్ లో ఒక యోధుడు కనిపించడం సహజం.

కానీ తాను ముఖ్యమంత్రి అయిన ఈ ఒక్క ఏడాదిలోనే జగన్ రాజకీయ నాయకుడి నుండి రాజనీతిజ్ఞుడుగా మారారు. సంక్షేమ పధకాలతో చరిత్రలో నిలిచిపోయేలా బాటలు వేస్తున్నారు. తాన రాజకీయ జీవితం అంతా ఒక్కడిగానే నిలబడి పోరాడి సాధించుకున్న విజయాన్నీ పూర్తిగా ప్రజల బాగు కోసం పాటుపడుతూ సార్ధకం చేసుకుంటున్నారు. జగన్ రాజకీయ జీవితాన్ని మొదటి నుండీ గమనించిన వారికి అనిపించే ఒకే మాట “ఒంటరిగా కాంగ్రెస్ పార్టీనుండి వెళ్లాడు , 10 ఏళ్ళు ఒక్కడిగా పోరాడి గెలిచాడు”