iDreamPost
android-app
ios-app

MLC elections social justice -ఇప్పుడూ జగన్ అదే స్ట్రాట‌జీ..!

MLC elections social justice -ఇప్పుడూ జగన్ అదే స్ట్రాట‌జీ..!

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏం చేసినా.. అందులో సామాజిక న్యాయం ఉంటోంది. సామాజికంగా అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డేలా నిర్ణ‌యాలు ఉంటున్నాయి. అన్ని వ‌ర్గాల ఆర్థికాభివృద్ధికి దోహ‌ద‌ప‌డేలా జ‌గ‌న్ ఆలోచ‌నా విధానాలు ఉంటున్నాయ‌ని ఇప్ప‌టికే ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ప‌ద‌వుల విష‌యంలోనూ అంద‌రికీ ప్రాధాన్యం ఇస్తున్నారు జ‌గ‌న్. అదేసమయంలో మహిళలకు కూడా అవకాశం ఇచ్చారు. 33 శాతం రిజర్వేషన్ ల‌ను క‌చ్చితంగా అమ‌లు చేయ‌డ‌మే కాదు.. స్థానిక ఎన్నిక‌ల్లో ఏకంగా 50 శాతం అవ‌కాశాలు మహిళ‌ల‌కే ఇచ్చారు. అలాగే.. పార్టీ ఎమ్మెల్సీల్లో 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు.. అందులోనూ 50 శాతం మంది మహిళలు ఉండేలా కొత్త అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం రాష్ట్రంలో అటు ఎమ్మెల్యే కోటాలో మూడు, ఇటు స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలను.. కేంద్ర ఎన్నికల సంఘం భర్తీ చేయనుంది.ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. అయితే.. ఈ ఎన్నికల్లో వైసీపీకి పోటీ నిల‌బ‌డే బ‌లం ఎవ‌రికీ లేదు. అధికార పార్టీ వైసీపీ కే.. ఇటు స్థానిక సంస్థల్లోనూ.. అటు.. ఎమ్మెల్యేల పరంగా కూడా.. బలం ఉండడంతో పోటీకి మరెవరూ వచ్చే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ నిర్ణయించిన వారే నేరుగా ఎమ్మెల్సీ అవుతారు. ఎమ్మెల్యేల కోటాలోని మూడు స్థానాల్లో ఒకటి డీసీ గోవిందరెడ్డి మరోటి పాలవలస విక్రాంత్కు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ముఖ్యమంత్రి శ్రీకాకుళం పర్యటనకు వెళ్లినపుడు అక్కడే విక్రాంత్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారంటూ ఆయన వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. మూడో స్థానం కొలిక్కి రావాల్సి ఉంది. ఈ నెల 15 లేదా 16న ముగ్గురు అభ్యర్థులూ నామినేషన్లు వేయవచ్చంటున్నారు.

ఇక స్థానిక సంస్థల కోటాలో 11 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విష‌యం తెలిసిందే. మొత్తం 14 స్థానాలను కూడా కైవసం చేసుకుంటామని వైసీపీ అధినాయకత్వం స్పష్టం చేస్తోంది. ఇక శాసనమండలిలో ఇప్పటికే ఆ పార్టీకి 18 మంది సభ్యులున్నారు. కొత్తగా 14 స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ బలం 32కు చేరుతుంది. నామినేటెడ్, ఇత‌ర పోస్టులు ఏమైనా స‌రే.. అన్నింట్లోనూ సామాజిక న్యాయం పాటిస్తున్నారు జ‌గ‌న్. బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటి మహిళలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ల భ‌ర్తీలో కూడా జ‌గ‌న్ అదే పంథా అనుస‌రించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఏదేమైనా జ‌గ‌న్ స్ట్రాట‌జీ అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read : YCP MLC Candidates – పాత, కొత్త కలయిక.. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..