iDreamPost
android-app
ios-app

చిన్న పిల్లల ఆరోగ్య దృష్ట్యా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్

  • Published Oct 13, 2020 | 9:58 AM Updated Updated Oct 13, 2020 | 9:58 AM
చిన్న పిల్లల ఆరోగ్య దృష్ట్యా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న చిన్నపిల్లల ఆరోగ్యం పెంపొందేలా ఇప్పటికే వైఎస్సార్‌ అమృత హస్తం, మధ్యాహ్న భోజన పథకం, బాలామృతం, వైఎస్సార్‌ బాల సంజీవని, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ లాంటి అనేక పదకాలను ప్రవేశ పెట్టి చిన్నపిల్లల ఆరోగ్యానికి భరోసాగా నిలిచింది.

అయితే తాజాగా రాష్ట్రంలో ఉన్న చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ ప్రభుత్వం మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. (అక్టోబర్13) నేటి నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం 5ఏళ్ళ లోపు ఉన్న పిల్లలందరికి వారు రే-చీకటి బారిన పడకుండా ఉండేందుకు విటమిన్-ఎ సప్లిమెంటేషన్ సిరప్ ఉచితంగా ఇవ్వనుంది. ఈ సప్లిమెంటేషన్ అన్ని అంగన్వాడి కేంద్రల్లో ఉచితంగా అందేలా చర్యలు చేపట్టింది.

5ఏళ్ళు లోపు ఉన్న ప్రతి చిన్నారికి వారి తల్లి తండ్రులు వారికి అందుబాటులో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాల్లో కాని, అంగన్వాడీ కేంద్రాల్లో కానీ… ఎ.ఎన్.ఎం , ఆశా, అంగన్వాడీ కార్యకర్తలను సంప్రదించి ఈ సప్లిమెంటేషన్ పొందాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.