iDreamPost
iDreamPost
జగన్ బెయిల్ రద్దు చేయాలని ప్రయత్నిస్తున్న రఘురామకృష్ణం రాజు ఆశలు పండేలా లేవు. దాంతో ఆయన ఉక్రోశం వెళ్లగక్కుతున్నారు. చివరకు రఘరామకృష్ణంరాజు తరుపున లాయర్లయితే సీబీఐ ని కూడా నిందించడానికి పూనుకుంటున్నారు. కావాలనే బెయిల్ విషయంలో సీబీఐ తాత్సార్యం చేస్తోందంటూ పిటీషనర్ తరుపు లాయర్లు చేసిన వ్యాఖ్యలు దానికో నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
ఓవైపు రఘురామకృష్ణంరాజు పై అనర్హత వేటుకి అడుగులు పడుతున్నాయి. మరోవైపు విద్వేషాలు రగిల్చి, సమాజంలో చిచ్చుపెట్టే యత్నం చేసిన ఆయన సుప్రీంకోర్టు బెయిల్ తో ఉన్న కేసులో మళ్లీ జైలుపాలయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కి వ్యతిరేకంగా ఆయన వేసిన పిటీషన్ లో కూడా ఫలితం వచ్చేలా కనిపించం లేదు. ఇవన్నీ కలిసి రఘురామకృష్ణంరాజు ని సుడిగుండంలో నెట్టినట్టుగా అవుతున్నాయి.
తాజాగా సీబీఐ కోర్టులో జరిగిన విచారణలో తన వాదనను సమర్పించేందుకు సీబీఐ సిద్ధంపడింది. దానికి గడువు కోరింది. ఆమేరకు కోర్టు అనుమతించింది. ఈనెల 26కి కేసును వాయిదా వేసింది. దాంతో సీబీఐ తీరు మీద పిటీషనర్ తరుపు లాయర్లు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా కనిపిస్తున్నాయి. సీబీఐని కూడా ప్రభావితం చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు కొందరు భావిస్తున్నారు.
కోర్టు ఈ కేసుని ఈనెల 26కి వాయిదా వేయడంతో ఈలోగా రఘురామకృష్ణంరాజుకి సంబధించిన కీలక పరిణామాలు మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా వచ్చే వారంలో గా ఆయనకు లోక్ సభ స్పీకర్ నుంచి నోటీసులు వస్తాయని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ విభాగం విప్ మార్గాని భరత్ అంటున్నారు. దాంతో వ్యవహారం ముదరిపాకాన పడుతున్నట్టుగానే భావించాలి. మరోవైపు గుంటూరులో నమోదయిన ఏపీసీఐడీ కేసులోకూడా చిక్కులు ఎదుర్కోవాల్సిన స్థితి వస్తే ఆయన మళ్లీ సమస్యల్లో ఇరుక్కునేలా ఉన్నారని అంచనాలు వినిపిస్తున్నాయి.