iDreamPost
android-app
ios-app

ప్రాణం మీదకు తెచ్చిన వాహనం పార్కింగ్

  • Published Jan 29, 2021 | 3:57 AM Updated Updated Jan 29, 2021 | 3:57 AM
ప్రాణం మీదకు తెచ్చిన వాహనం పార్కింగ్

ఆ మధ్య చిలసౌతో డీసెంట్ హిట్టు కొట్టి అల వైకుంఠపురములో సపోర్టింగ్ రోల్ లో కనిపించిన సుశాంత్ కొత్త సినిమా ఇచట వాహనములు నిలుపరాదు టీజర్ ఇందాక ప్రభాస్ ద్వారా సోషల్ మీడియా వేదికగా విడుదలయ్యింది. ఎస్ దర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ముందు ఏదో ఎంటర్ టైనర్ అనుకున్నారు కానీ తీరా ఈ వీడియో చూస్తే క్రైమ్ థ్రిల్లర్ అనే క్లారిటీ వచ్చేసింది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చారు. కెరీర్ మొత్తంలో ఇప్పటిదాకా ఒకే సక్సెస్ ఉన్న సుశాంత్ దీని మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

చక్కని కుటుంబం, స్నేహితులు, అందమైన ప్రియురాలు ఇలా సరదాగా జీవితం గడుపుతున్న ఓ కుర్రాడు తన రాయల్ ఎంఫిల్డ్ బైక్ ఓ ప్రాంతంలో పార్క్ చేయడమే ప్రాణాల మీదకు తెస్తుంది. ఓ బస్తీ జనం మొత్తం అతన్ని చంపేందుకు కంకణం కట్టుకునే దాకా వెళ్తుంది. అసలు తను అక్కడికి ఎందుకు వెళ్ళాడు, బైక్ పెట్టినందువల్ల జరిగిన అనర్థం ఏమిటనేది తెలియాలంటే సినిమాలోనే చూడాలి. విజువల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. థ్రిల్లర్ ని హారర్ టైపు టేకింగ్ తో డైరెక్టర్ ఏదో వెరైటీగా ట్రై చేసినట్టు ఉన్నాడు. టీజర్ కూడా స్టోరీ సగమే అర్థమయ్యేలా చాలా తెలివిగా కట్ చేశారు.

వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు ఇందులో ఇతర పాత్రలు పోషించారు. ఇంటెన్స్ ఉన్న క్రైమ్ డ్రామా అని అర్థమైపోయింది కాబట్టి ఈ జానర్ ని ఇష్టపడే వాళ్లకు కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ లాగే కనిపిస్తోంది. సుశాంత్ తో పాటు క్యాస్టింగ్ కూడా బాగానే సెట్ అయ్యింది. హీరోయిన్ మీనాక్షి లుక్స్ బాగున్నాయి. అసలే సమ్మర్ మొత్తం భారీ సినిమాలతో జామ్ ప్యాక్ అవుతున్న తరుణంలో ఇచట వాహనములు నిలుపరాదు ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇంకా తెలియదు. టీజర్ లో కూడా అనౌన్స్ చేయలేదు. మార్చ్ లోనే రంగ్ దే, వకీల్ సాబ్ ల కంటే ముందే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తారు.

Teaser Link @ http://bit.ly/2YooAiH