iDreamPost
android-app
ios-app

సూపర్ స్టార్ కోసం ఖల్ నాయక్ ?

  • Published Sep 08, 2021 | 10:28 AM Updated Updated Sep 08, 2021 | 10:28 AM
సూపర్ స్టార్ కోసం ఖల్ నాయక్ ?

ప్రస్తుతం సర్కారు వారి పాటనే ప్రపంచంగా ఉంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారిక ప్రకటన ఇచ్చేశారు. పూజా హెగ్డే హీరోయిన్ గా తమన్ సంగీతం సమకూర్చడం కూడా లాక్ అయిపోయింది. తాజాగా ఇందులో బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇలా హిందీ స్టార్లను తీసుకురావడం మాటల మాంత్రికుడికి కొత్తేమి కాదు. అసలు అక్షరం తెలుగు ముక్క రాని బోమన్ ఇరానీని తీసుకొచ్చి అద్భుతమైన యాక్టింగ్ రాబట్టుకుని మంచి క్యారెక్టర్ తో గుర్తుండిపోయేలా చేయడం ఆల్రెడీ అత్తారింటికి దారేదిలో జరిగింది.

ఇప్పుడు సంజయ్ దత్ కనక మహేష్ 28కి తోడైతే పాన్ ఇండియా మార్కెట్ పరంగా హెల్ప్ అవుతుందన్న అంచనా కావొచ్చు. కెజిఎఫ్ 2 నుంచి సంజూ బాబా సౌత్ సినిమాల మీద మనసు పారేసుకునున్నాడు. ఎక్కువ కాల్ షీట్స్ డిమాండ్ చేయకుండా కాలం వృథా కాకుండా మన దర్శకుల తీరు చూసి నార్త్ యాక్టర్లు మంచి కథ వస్తే చాలు వెంటనే ఓకే చెబుతున్నారు. త్రివిక్రమ్ లాంటి వాళ్ళు కన్విన్స్ చేయడంలో ఎంత దిట్ఠో తెలుసుగా. సంజయ్ దత్ ఇప్పటిదాకా ఒకే ఒక్క తెలుగు సినిమాలో కనిపించారు. పాతికేళ్ల క్రితం వచ్చిన నాగార్జున చంద్రలేఖలో అలా వచ్చి ఇలా మాయమయ్యే ఒక సన్నివేశం ఉంటుంది.

కానీ అది డిజాస్టర్ కావడంతో ఆ క్యామియో వల్ల ఎవరికీ ఉపయోగం కలగలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు కాబట్టి ఒప్పుకునే ఛాన్స్ ని కొట్టిపారేయలేం. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే 2022 సంక్రాంతికి సర్కారు వారి పాటను రిలీజ్ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు కానీ ఒకవేళ ఆర్ఆర్ఆర్ కనక పండగ బరిలో దిగితే ఏం చేయాలన్న దాని మీద తన టీమ్ తో చర్చిస్తున్నారట. రాజమౌళితో నెక్స్ట్ మూవీ ఉంది కాబట్టి మొహమాటపడక తప్పదేమో. ఇవి కాకుండా వేరే దర్శకులు ప్రస్తుతానికి మహేష్ లిస్ట్ లో లేరు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ తన శైలికి భిన్నంగా జక్కన్న కోసం ఏళ్ళ తరబడి కాల్ షీట్స్ ఇవ్వడం ప్రిన్స్ కు పెద్ద సవాలే

Also Read: క్లాసిక్ రీమేక్ తెరపైకి వస్తోంది

jojobet girişJojobet GirişJojobet GirişCasibomivermectin tabletMadridbetMadridbetPokerklasmeritbetCasibom GirişmeritbetpokerklasBetvolemarsbahis giriş