క్లాసిక్ రీమేక్ తెరపైకి వస్తోంది

By iDream Post Sep. 07, 2021, 06:30 pm IST
క్లాసిక్ రీమేక్ తెరపైకి వస్తోంది

ఇతర భాషల్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాల రీమేక్ హక్కులను కొనడంలో వాటిని తీయడంలో మనవాళ్ళు ఎంత ఫాస్ట్ గా ఉంటారో తెలిసిందే. తమిళం మలయాళం కలిపి సుమారు పదికి పైగా రీమేకులు ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మాణంలో ఉన్నాయి. అంతకన్నా ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యం లేదు. అయితే 2017లో వచ్చిన విక్రమ్ వేదా మాత్రం ఇప్పటిదాకా ఇక్కడ తీయకపోవడం వింతే. దీని గురించి సోషల్ మీడియాలో అభిమానులు ఎంతగా కోరుకున్నా ఏ దర్శక నిర్మాతా వీళ్ళ మొర ఆలకించలేదు. ఆఖరికి హిందీలో హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ ల కాంబినేషన్ లో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాక ఇక్కడ కూడా చలనం వచ్చినట్టు ఉంది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం విక్రమ్ వేదా రీమేక్ లో విక్టరీ వెంకటేష్ నటించడం దాదాపు ఖరారైనట్టేనని ఫిలిం నగర్ న్యూస్. అది మాధవన్ క్యారెక్టరా లేక విజయ్ సేతుపతి పాత్రా అనేది తెలియదు కానీ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం. మరి తనతో ఢీ అంటే ఢీ అనే రోల్ ని ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రానా అయితే పర్ఫెక్ట్ ఛాయస్ అవుతాడు. అందులోనూ బాబాయ్ అబ్బాయి కాంబినేషన్ అవుతుంది. క్రేజ్ కూడా బాగుంటుంది. ఒకవేళ రవితేజ లాంటి వాళ్ళు చేసినా మార్కెట్ లో వేల్యూ పెరుగుతుంది. ఇక దర్శకుడు ఎవరనేది కూడా ప్రస్తుతానికి పేరు బయటికి రాలేదు. కొంచెం టైం పట్టేలా ఉంది.

దీని సంగతలా ఉంచితే వెంకీ ప్రస్తుతం చిన్న బ్రేక్ లో ఉన్నారు. వరుణ్ తేజ్ గని పూర్తి చేసుకుని రాగానే బాలన్స్ ఉన్న ఎఫ్3 పూర్తి చేసే పనిలో దర్శకుడు అనిల్ రావిపూడి బిజీ అయిపోతాడు. 2022 సంక్రాంతికి రావడం అనుమానమే. దృశ్యం 2 ఓటిటినా థియేటరా అనే కన్ఫర్మేషన్ బయటికి ఇవ్వడం లేదు కానీ ఆల్మోస్ట్ హాట్ స్టార్ తో డీల్ ఓకే అయిపోయిందని దసరా సందర్భంగా ప్రీమియర్ ఉంటుందని టాక్ ఉంది. ఇది ముందే జరిగిన ఒప్పందం కాబట్టి థియేటర్లు తెరవడం మీద దీనికి లింక్ ఉండదని అంటున్నారు. కూతురు చేస్తున్న కుకింగ్ వీడియోస్ లో స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తున్న వెంకటేష్ ప్రస్తుతం రిలాక్స్ మోడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు

Also Read : వినాయక చవితికి వినోదాల పండగ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp