iDreamPost
iDreamPost
అధికారికంగా కాదు కానీ ఈ ప్రశ్నకు సన్నిహిత వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడిగా పేరున్న నితిన్ ఈ ఏప్రిల్ లో పెళ్లి కొడుకు కాబోతున్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు లండన్ లో ఎంబిఎ చేసిన షాలిని అనే అమ్మాయికి మూడు ముళ్ళు వేయబోతున్నాడట. ఇది ఒకరకంగా లవ్ కం అరెంజ్డ్ మ్యారేజ్ అని టాక్. ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరి దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ప్లానింగ్ చేయబోతున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయట.
ప్రస్తుతం నితిన్ భీష్మ పూర్తి చేసి విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవలే టీజర్ విడుదలై మంచి స్పందన దక్కించుకుంది . హిట్ అవుతుందన్న నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది. నితిన్ పరిశ్రమకు వచ్చి 18 ఏళ్ళు దాటింది. 2002లో జయంతో పరిచయమై మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని తర్వాత యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.
దిల్, సై, గుండె జారి గల్లంతయ్యిందే, అఆ లాంటి సూపర్ హిట్లు చాలానే ఇతని ఖాతాలో ఉన్నాయి. శ్రీనివాస కళ్యాణం తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న నితిన్ భీష్మ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకుడు. ఫిబ్రవరి రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఒకవేళ ఈ పెళ్లి వార్త కానక నిజమైతే భీష్మ వచ్చిన తక్కువ గ్యాప్ లోనే పెళ్లి కొడుకు కాబోతున్న నితిన్ కు డబుల్ బొనాంజా దక్కినట్టే.