ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ప్రత్యేకంగానే కనిపిస్తాయి. ఇక్కడ కులం, మతం, విద్వేషాలు, వింత వాదనలు వింటే మతి పోవాల్సిందే. పాలనపరమైన అంశాల మీద చర్చే ఉండదు. ప్రతి చిన్న విషయానికి సోషల్ మీడియా ఎక్కడం విపక్షాల వంతు అయ్యిందే తప్ప పాలనా వ్యవహారలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విపక్షాల పాత్ర శున్యం అని చెప్పాలి.
ఏదో ఒక అంశంతో రచ్చ
ఈ రోజు హిందూ ఆలయాలు, రేపు కులం విద్వేషాలు, ఎల్లుండి మరొక అంశం అన్నట్లుగా విపక్షాల తీరు నానా యాగి చేసి మీడియా, ప్రజల అటెన్షన్ తిప్పుకోవాలని ఉందే తప్ప పాలన అంశాల్లో సూచనలు ఇవ్వడం, వివిధ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే చర్యలే కనిపించడం లేదు. గత 8 నెలల్లో విపక్షాలు చేసిన ఆరోపణలు పరిశీలిస్తే ఇది అర్థం అవుతుంది.
ప్రభుత్వ వేగాన్ని తట్టుకోలేక!
సంక్షేమ పథకాల అమలులో జగన్ ప్రభుత్వం ముందు ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని అంశాలను జగన్ ఇప్పటికే నిర్వర్తించారు. వాటితో పాటు మరికొన్ని అంశాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు వెనువెంటనే తీసుకొస్తోంది. ప్రభుత్వ నిర్ణయాల వేగం… ప్రజలకు దగ్గర అవుతున్న తీరు విపక్షాలకు ఇప్పుడు కంటిగింపుగా మారింది. ప్రతిష్టాత్మక సంస్థలు సైతం జగన్ ప్రభుత్వ విధానాల మీద ఆయనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ మీద చేసిన సర్వేలో మంచి ఫలితాలు రావడం పక్షాలకు దిక్కుతోచని స్థితిలో పడేస్తోంది. దీంతోనే రోజుకో విషయాన్ని విద్వేషాన్ని ప్రజల్లో నింపి దానిమీద రాజకీయాలు చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
అన్ని విచిత్రలే..
విపక్షాలు చేస్తున్న ఆందోళనలో చాలావరకు చాలా సిల్లీ అంశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, ధరల పెరుగుదల మీద కూడా విపక్షాల స్పందన చూస్తుంటే పనిగట్టుకొని మాత్రమే రోజు సోషల్ మీడియాలో ఆయా పార్టీల విభాగాలు ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. విమర్శలో కచ్చితమైన విధానం.. ఆధారాలు లెక్కలు ఏమీ లేకుండానే ప్రభుత్వం మీద ప్రతి అంశాన్ని రుద్దే ప్రయత్నం విపక్షాలు భుజానికెత్తుకున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వింత గా వైరటీ బాట పట్టాయని, విపక్ష పాత్ర లో ఒరిగిపోయే పార్టీలు ఇక్కడ లేదన్నది… దానికి అనుగుణంగా పరిస్థితి లేకపోవడమే ఈ వింతలకు కారణాలు అనేది విశ్లేషకుల మాట.