iDreamPost
android-app
ios-app

హింట్ ఇస్తున్న కెజిఎఫ్ ఛాప్టర్ 2

  • Published Oct 12, 2020 | 10:55 AM Updated Updated Oct 12, 2020 | 10:55 AM
హింట్ ఇస్తున్న కెజిఎఫ్ ఛాప్టర్ 2

లాక్ డౌన్ క్లైమాక్స్ కు చేరుకుంది. జన జీవనం దాదాపు సాధారణం అయిపోయింది. వైరస్ జీరో కాలేదు కానీ మునుపటితో పోలిస్తే మాత్రం పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది . అడపాదడపా తప్ప పెద్దగా కేసులు నమోదవుతున్న దాఖలాలు తక్కువే. కరోనా ఆసుపత్రులు ఎక్కువ శాతం ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇక థియేటర్లను అక్టోబర్ 15 నుంచి 50 శాతం ఆక్యుపెన్సీతో తెరుచుకోవచ్చని అనుమతులు ఇచ్చినా కూడా ఇప్పటికిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెరిచే సీన్ కనిపించడం లేదు. ఒకటి రెండు మల్టీ ప్లెక్సులు తప్ప సింగల్ స్క్రీన్ యాజమాన్యాలు వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా కెజిఎఫ్ చాప్టర్ 2021 సంక్రాంతికి టార్గెట్ చేసుకుని ఆ మేరకు పనులను గవంతం చేసుకుంటోంది. ఇప్పటికే పూర్తయిన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయిపోవస్తున్నాయి

ఆర్ఆర్ఆర్ తప్పుకుంది కాబట్టి ఇంకెవరు పోటీకి వచ్చినా అంత ప్రభావం ఏముండదు. అందుకే జనవరి 14 వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారని బెంగుళూరు టాక్.హీరో యష్ మొన్నటి నుంచి బాలన్స్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. చిన్న షెడ్యూల్ లో వచ్చే నెలకంతా తన  భాగాన్ని ఫినిష్ చేయబోతున్నారు. దసరాకు లేదా దీపావళి అఫీషియల్ గా విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉన్న క్రేజ్ ఉన్న కెజిఎఫ్ 2 లాంటి సినిమాలు వస్తేనే బాక్సాఫీస్ కు ఊపొస్తుంది. జనం కూడా థియేటర్లకు వస్తారు. ఆ లోగా దాని కన్నా ముందు డిసెంబర్ లో క్రాక్, రెడ్, ఉప్పెన, అరణ్య లాంటి మూవీస్ లో ఒకటో రెండో వచ్చేస్తాయి కాబట్టి పబ్లిక్ అలవాటు పడిపోయి ఉంటారు. వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ముడిపడిన ప్రాజెక్ట్ కాబట్టి నిర్మాతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 

వచ్చే సంవత్సరం ప్రారంభమయ్యే లోగా సినిమా హాళ్ల మీద ఆంక్షలన్నీ పూర్తిగా తొలగిపోతాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. అదే నిజమైతే అంత కన్నా శుభవార్త ఏముండదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న కెజిఎఫ్ 2లో సంజయ్ దత్ మెయిన్ విలన్ అధీరాగా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ ప్రధాని ఇందిరా గాంధీని పోలిన పాత్రలో కనిపించనుంది. ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి కొత్త క్యాస్టింగ్ కూడా సీక్వెల్ లో తోడయ్యింది. త్వరలోనే టీజర్ వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కన్నడ ఫిలిం హిస్టరీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కెజిఎఫ్ 1 కి సీక్వెల్ కాబట్టి దానికి పదింతలు ఎక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ రావొచ్చని అంచనా. ఒరిజినల్ వెర్షన్ కంటే తెలుగు, హిందీలో దీన్ని భారీగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరి తనతో సై అంటూ పండగ బరిలో దూకేదెవరో వేచి చూడాలి