iDreamPost
android-app
ios-app

హరీష్ తీయబోయేది మల్టీ స్టారరా

  • Published May 18, 2020 | 10:59 AM Updated Updated May 18, 2020 | 10:59 AM
హరీష్ తీయబోయేది మల్టీ స్టారరా

హరీష్ శంకర్ శంకర్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదుని సార్థకం చేస్తూ ఈ దర్శకుడు ఇచ్చిన ఈ బ్లాక్ బస్టర్ ఇటీవలే 8 ఏళ్ళు పూర్తి చేసుకుని సోషల్ మీడియాలో హంగామా చేసింది. ఇంత గ్యాప్ తర్వాత ఇతనికి పవన్ 28 డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానికి ఇంకా చాలా టైం పడుతుంది. పవన్ ముందు వకీల్ సాబ్ ఫినిష్ చేయాలి. ఆ తర్వాత క్రిష్ డైరెక్షన్ లో విరుపాక్ష(ప్రచారంలో ఉన్న టైటిల్)కి బల్క్ డేట్స్ ఇవ్వాలి. కరోనా వల్ల ఇదంతా ఆలస్యమయ్యింది.

ఎంతలేదన్నా ఈ రెండు పూర్తవ్వడానికి కనీసం ఏడాదిన్నర పడుతుంది. ఈలోగా హరీష్ శంకర్ మరో ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు. ఇవాళ 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ హరీష్ తో మరో సినిమా చేయబోతున్నందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేయడం ఆసక్తి రేపుతోంది. అయితే ఎవరితో అనే వివరాలు మాత్రం అందులో ఇవ్వలేదు.

ఇదే బ్యానర్ లో హరీష్ శంకర్ గద్దల కొండ గణేష్ చేశారు. మంచి కమర్షియల్ హిట్ అనిపించుకుంది. దీనికి రెండు మూడేళ్ళ క్రితమే దాగుడు మూతలు అనే మల్టీ స్టారర్ సబ్జెక్టు హరీష్ ఎప్పుడో సిద్ధం చేసుకున్నారు. దిల్ రాజు బ్యానర్ లో చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కాని ఎందుకనో కార్యరూపం దాల్చలేదు.

శర్వానంద్-నాని లేదా రామ్ ఈ ముగ్గురిలో ఇద్దరి కాంబోలో ఇది రూపొందుతుందని గట్టి టాకే వినిపించింది. హీరొయిన్లుగా రకుల్, సాయి పల్లవి, నివేదా థామస్ అనే టాక్ కూడా నడిచింది. ఇప్పుడు 14 రీల్స్ కి హరీష్ శంకర్ చేయబోయేది ఇదేనా లేక ఏదైనా ఫ్రెష్ సబ్జెక్టా అనేది వేచి చూడాలి. గబ్బర్ సింగ్ క్రెడిట్స్ గురించి హరీష్ శంకర్ కు నిర్మాత బండ్ల గణేష్ తో ఆన్ లైన్ వార్ జరుగుతోంది. హరీష్ కు మద్దతుగా నిర్మాత పివిపి కూడా తోడయ్యారు. ఇది సాగుతుండగానే ఇప్పుడీ అఫీషియల్ న్యూస్ బయటికి రావడం విశేషం. ఇది రీమేక్ కాకుండా స్ట్రెయిట్ సబ్జెక్టు అని తెలిసింది. లాక్ డౌన్ అయ్యాక పూర్తి వివరాలు వస్తాయి.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetbetsmoveMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabet girişHoliganbetJojobetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomHoliganbet