Idream media
Idream media
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం ఇంకో రెండు రోజుల్లో ముగుస్తుందనగా టీడీపీ కొంప ముంచిన ఓ వీడియో గుర్తుంది కదా? అయితే టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అందులో ఏమన్నారో కూడా గుర్తుండే ఉంటుంది. ‘టీడీపీని నమ్ముకొని రోడ్డున పడ్డానండి. నా ఫోన్ కూడా ఎత్తడం మానేశారండి. రాజగోపాల్ ఎత్తడం లేదు… రమేశ్ ఎత్తడం లేదు’… అని ఆ వ్యక్తి అచ్చెన్నాయుడితో చెబుతాడు. దీంతో వెంటనే అచ్చెన్నాయుడు.. ‘ఈ 17 తర్వాత ఫ్రీ అయిపోతాం.. ఇక పార్టీ లేదు… బొక్కా లేదు..’ అంటూ టీడీపీనీ తీసిపారేయడం సంచలనమైంది. అలాగే ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే..
పంచాయతీ ఎన్నికల ఎపిసోడ్ తర్వాత అచ్చెన్నాయుడు కొంతకాలంగా శ్రీకాకుళం జిల్లాలోని సొంత నియోజకవర్గం లో ఎక్కువగా తిరగడం లేదు. ముఖ్యమైన కార్యక్రమాల మినహా మిగతా సమయం పర్సనల్ కే అంకితం చేస్తున్నారు. అయితే, ఇటీవల అచ్చెన్న పర్యటించారట. పర్యటన సందర్భంగా పార్టీ ఆఫీసులో మద్దతుదారులు నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో సమావేశం జరిపారట. సమావేశమైనా, సభ ఏదైనా వైసీపీని, జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకునే అచ్చెన్న అందుకు విరుద్ధంగా మాట్లాడారట. వైసీపీ పై పోరాటాలు మానేయమని టీడీపీ శ్రేణులకు సూచించారట. . కొంతకాలం పాటు మన పోరాటాలను ఆపేయండని స్పష్టంగా చెప్పారట. వైసీపీ నేతలపై మనం పోరాటాలు చేసి సాధించేది కూడా ఏమీ లేదని కాబట్టి ఎవరి పనుల్లో వాళ్ళనుండమన్నారట.
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు వైసీపీ నేతల విషయం చూద్దామంటు అచ్చెన్న స్పష్టంగా చెప్పేశారు. దాంతో ఏమి మాట్లాడాలో అర్ధంకాక టీడీపీ నేతలు మౌనంగా ఉండిపోయారట. అచ్చెన్న తాజా వైఖరి చూస్తుంటే తనపై పడిన కేసుల ప్రభావం బాగా కనిపిస్తోందని అర్ధమవుతోంది. నిజానికి అచ్చెన్న జిల్లాలో కూడా ఎక్కువగా ఉండటంలేదు. ఉంటే ఇటు విజయవాడలో లేకపోతే వైజాగ్ లో ఎక్కువగా ఉంటున్నారట.
పార్టీ జాతీయ అధ్యక్షుడు పిలుపిచ్చిన నిరసన కార్యక్రమాల్లో కూడా ఫుల్లుగా ఇన్వాల్వ్ కావటం లేదని పార్టీలోనే టాక్ నడుస్తోంది. జగన్ ప్రభుత్వంపై నిరసనలు తెలపాలని చంద్రబాబు చాలాసార్లే పిలుపునిచ్చారు. అయితే పార్టీ సీనియర్ నేతలు జిల్లాల్లోని నేతలు కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారో చూసుకోవాల్సిన బాధ్యత అచ్చెన్నదే. అయితే చంద్రబాబు పిలుపు ప్రకారం మిగిలిన అందరితో పాటు తాను కూడా అన్నట్లుగా మాత్రమే అచ్చెన్న నిరసన కార్యక్రమాల్లో మమ అనిపిస్తున్నట్లు కొంతకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వైఖరి ప్రకారం మిగిలిన మూడేళ్ళు కూడా అచ్చెన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహా అయితే మీడియాలో మాత్రమే కనబడే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఉన్న కేసుల కారణంగా భవిష్యత్తులో మరిన్ని కేసులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపైనే ఉందని అచ్చెన్నకు అర్ధమైనట్లుంది. తన విషయాలనే సక్రమంగా చూసుకోలేకపోతున్న అచ్చెన్న ఇక మద్దతుదారుల వ్యవహారాలను ఏమి చూడగలరు ? అందుకనే ముందుజాగ్రత్తగా దూకుడు తగ్గించుకోమని సలహా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.