Idream media
Idream media
ప్రజాధనం దుర్వినియోగం ,అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఐఆర్‌ఎస్ అధికారి జె. కృష్ణకిశోర్‌తో పాటు పే అండ్ అకౌంట్స్ విభాగానికి చెందిన అకౌంట్స్ అధికారి శ్రీనివాసరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
వీరిద్దరి మీద నమోదైన అభియోగాలపై తక్షణమే కేసు నమోదు చేసి ఆరు నెలల్లోగా దర్యాప్తు ప్రక్రియ పూర్తిచేయాలని ఏసీబీ మరియు సీఐడీ విభాగాలను ప్రభుత్వం ఆదేశించింది. కేసు దర్యాప్తు ప్రక్రియ పూర్తయ్యే వరకూ ప్రభుత్వ అనుమతిలేనిదే వారివురూ అమరావతిని వీడరాదని తెలిపింది.
ప్రజాధనం దుర్వినియోగంలో ఈ ఇద్దరు అధికారుల పాత్ర ఉందని పరిశ్రమలు,పెట్టుబడులు, వాణిజ్య శాఖ ప్రభుత్వానికి వేర్వేరుగా నివేదికలు సమర్పించింది. పరిశీలించిన ప్రభుత్వం.. వీరిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది.
చార్టెడ్ అకౌంటెంట్ గా కెరీర్ ప్రారంభించిన కృష్ణ కిషోర్ ,బ్రహ్మయ్య & కో అకౌంటింగ్ కంపినీలో మొదట పనిచేశాడు.ఐఆర్‌ఎస్ కు ఎన్నికయిన తరువాత అనేక హోదాల్లో పనిచేశాడు.
ప్రభుత్వ వర్గాలలో జస్టిస్ ఈశ్వర ప్రసాద్ కొడుకుగా పాపులర్ అయినా కృష్ణ కిషోర్ చంద్రబాబు హయాంలో 2016లో చంద్రబాబు ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా నియమించారు.