iDreamPost
android-app
ios-app

కొంకణ్ తీరం లో పూర్వీకుల ఇంట ఐర్లాండ్ ప్రధాని

కొంకణ్ తీరం లో పూర్వీకుల ఇంట ఐర్లాండ్ ప్రధాని

ఐర్లాండ్ ప్రధాని లియో వారద్కర్ తన కుటుంబ సభ్యులతో పాటు మహారాష్ట్రలోని ముంబైకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామమైన “వరద్”కి వచ్చారు. కొంకణ్ ప్రాంతంలోని సింధుదుర్గ్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం మల్వాన్ తహసీల్ పరిధిలో ఉంది. 2017 జూన్ లో ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నికయ్యాక లియో వారద్కర్ తన గ్రామానికి రావడం ఇదే తొలిసారి.

వారద్కర్ తండ్రి అశోక్ వారద్కర్ వృత్తి రీత్యా వైద్యులు. ఆయన 1960 లలో యూకే వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కాగా వారద్కర్ గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్థులంతా ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారద్కర్ స్థానికులతో ఆప్యాయంగా ముచ్చటించారు. తన కుటుంబానికి చెందిన మూడు తరాల వారితో సమావేశమైనందున ఈ పర్యటన నా జీవితాంతం గుర్తు పెట్టుకొనే “ఉద్విగ్నభరితమైన క్షణాలు ” గా ఐర్లాండ్ ప్రధాన మంత్రి చెప్పారు.

ఈ పర్యటన లో స్వగ్రామంలో ఆయన తమ గ్రామ దేవత ఆలయాన్ని కూడా ఆయన సందర్శించారు. ప్రస్తుతానికి వ్యక్తిగత పర్యటనలో ఉన్న నేను ఈసారి నా అధికార పర్యటనలో గ్రామాన్ని మరోసారి సందర్శించాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు.