iDreamPost
android-app
ios-app

IPL పాట్ కమిన్స్ @ 15.50 కోట్లు

IPL పాట్ కమిన్స్ @ 15.50 కోట్లు

ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం బీసీసీఐ కోల్ కతాలో నిర్వహిస్తున్న ఆటగాళ్ల వేలం కొనసాగుతుంది. 73 మంది ఆటగాళ్ల కోసం వేలం జరుగుతుండగా 332 మంది క్రికెటర్లకు వేలంలో పాల్గొన్నారు. ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లను కుమ్మరిస్తున్నాయి.

ఆటగాళ్లలో ఎవ్వరూ ఊహించని విధంగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ అత్యధికంగా 15.50 కోట్ల ధర పలకగా,ముందుగా ఊహించిన విధంగానే మాక్స్ వెల్ 10.5 కోట్ల ధర పలికాడు. కానీ యూసుఫ్ పఠాన్,స్టువర్ట్ బిన్నీ, డి గ్రాండ్ హోమ్, పుజారా, హనుమ విహారిలను కొనడానికి ఏ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.

ఇప్పటివరకూ వేలంలో అమ్ముడుపోయిన క్రికెటర్ల వివరాలు..

పాట్ కమిన్స్ 15.50 కోట్లు కోల్ కతా నైట్ రైడర్స్
మాక్స్ వెల్ ను 10.5 కోట్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్
క్రిస్ మోరిస్ 10 కోట్లు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు
సామ్ కరన్ 5.5 కోట్లు చెన్నై సూపర్ కింగ్స్
మోర్గాన్ 5.25 కోట్లు కోల్ కతా నైట్ రైడర్స్
ఆరోన్ ఫించ్ 4.4 కోట్లు రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు
ఊతప్ప 3 కోట్లు రాజస్థాన్ రాయల్స్
క్రిస్ లిన్ 2 కోట్లు ముంబై ఇండియన్స్
జాసన్ రాయ్ 1.5 కోట్లు ఢిల్లీ కాపిటల్స్
క్రిస్ వోక్స్ 1.5 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్

ఫామ్ లో లేని యూసుఫ్ పఠాన్,స్టువర్ట్ బిన్నీ, డి గ్రాండ్ హోమ్, పుజారా, హనుమ విహారి వేలంలో చుక్కెదురయింది.