ఐపీఎల్ లో ముంబై వాంఖడే స్టేడియం ఏ జట్టుకు అంతగా కలిసి రావడం లేదు. ముఖ్యంగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఇక్కడ తప్పు స్కోర్లు నమోదు చేస్తూ, ఓటమి పాలవడం ఈ ఐపీఎల్ లో విశేషం. గత మూడు రోజులుగా అత్యల్ప స్కోర్లు నమోదు అవుతున్న ఐపీఎల్ లో శుక్రవారం సైతం అదే పరిస్థితి కనిపించింది. చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ తక్కువ స్కోరు చేయడంతో తేలిపోయింది. చాలా సునాయాసంగా చెన్నై సూపర్ కింగ్స్ తన లక్ష్యాన్ని అధిగమించింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ దెబ్బకు పంజాబ్ బ్యాట్స్మెన్లు విలవిలా డారు. వచ్చినవారు వచ్చినట్టుగానే అవుట్ అవడంతో ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపు, బ్యాట్స్మెన్లు క్రీజ్లో కుదురుకునే లోపే జరగాల్సిన నష్టం పంజాబ్కు జరిగిపోయింది. 7 ఓవర్లలో 26 పరుగులు చేసి ఏకంగా ఐదు వికెట్లను కోల్పోయింది. ఒకానొక దశలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు పంజాబ్ నమోదు చేసేలా కనిపించింది. కె.ఎల్.రాహుల్, క్రిస్ గేల్ వంటి కీలక వికెట్లను తీసిన దీపక్ చాహర్ తన కెరీర్లోనే బెస్ట్ 13 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు కీలక పంజాబ్ వికెట్లను తీసి చెన్నై ను ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. అతి తక్కువ స్కోరుకే ఐదు వికెట్లు కోల్పోయిన పంజాబ్ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు కేవలం వికెట్ కాపాడుకోవడానికి చాలా మెల్లగా ఆడడంతో స్కోర్ లో వేగం ఎక్కడ కనిపించలేదు. కేవలం 20 ఓవర్లలో106 పరుగులు మాత్రమే చేసిన పంజాబ్ చెన్నై ముందు 157 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
టార్గెట్ ను ఛేదించడానికి బరిలోకి వచ్చిన చెన్నై బ్యాట్స్మెన్లు ఆడుతూ పాడుతూ లక్ష్యం వైపు వెళ్లారు. వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డు ను ముందుకు కదిలించారు. ఓపెనర్ డూ ప్లేసేస్ సమయోచితంగా ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దె ప్రయత్నం చేశాడు. చెన్నై ఓపెనర్ రూతురాజ్ గైక్వాడ్ తనకు అందివచ్చిన అవకాశాన్ని మరోసారి వదులుకున్నాడు. ఏ మాత్రం ప్రభావం చూపని ఆటతీరుతో మరోసారి విమర్శల పాలయ్యాడు. తక్కువ స్కోరుకే గైక్వాడ్ అవుట్ అయినప్పటికీ తర్వాత వచ్చిన మోయిన్ అలీ చక్కగా ఆడి మంచి స్కోరు సాధించి అవుట్ అయి వెనుదిరిగాడు. మూడోవికెట్ రూపంలో మైదానంలోకి దిగిన సురేష్ రైనా కూడా లేని షాట్కు ప్రయత్నించి విజయానికి ఇంకా 8 పరుగులు అవసరం అయిన సమయంలో పెవిలియన్ చేరాడు. రైనా తర్వాత మైదానంలో అడుగుపెట్టిన అంబటి రాయుడు సైతం మొదటి బాల్ కే అనవసర షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. అయితే అప్పటికే లక్ష్యం చేరువ కావడంతో సామ్ కరన్ మిగిలిన పరుగులు సాధించి చెన్నై కు 26 బాల్స్ ఉండగానే విజయాన్ని అందించారు.
శనివారం ముంబై ఇండియన్స్ తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇప్పటికే వెనుకబడిన సన్రైజర్స్ కు ఇది కీలకమైన మ్యాచ్. మరోపక్క ప్రతి మొదటి మ్యాచ్ను ఓడిపోయే అలవాటు ఉన్న ముంబై తర్వాత పుంజుకోవడం ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుందో అన్నది ఇరు జట్లకు సవాల్ లాంటిదే.