Idream media
Idream media
బైడైన్ గెలుపుతో… మన దేశానికేమైనా నష్టముంటుందా..!? ఇది.. అమెరికాలో స్థిరపడిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రవిని అతని స్నేహితుడు అడిగిన ప్రశ్న. బైడైన్ గెలుపుతో చైనాకు లాభం ఉంటే ఉండొచ్చు… రష్యాతో యుద్ధం జరిగితే జరగొచ్చు.. కానీ మన జోలికి రాడు. ఎందుకంటే.. కమలా హ్యారిస్ ఉందిగా..! ఇది రవి సమాధానం. ఈ ఉదాహరణే చెబుతోంది కమలా హ్యారిస్ పై భారతీయులకు ఉన్న నమ్మకం. లాభనష్టాల సంగతి అటుంచితే.. ఆమె భారత సంతతికి చెందిన మహిళ కావడంతో భారతీయులు గర్వంగా ఫీలవుతున్నారు. అందుకే ఆమె గెలుపు కోసం చాలామంది భారతీయులు ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులు ఫలించాయి. భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టబోతున్నారు.
ఒక మహిళ, ఒక ఆసియన్ అమెరికన్‌కు ఈ పదవికి దక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంటే కమలా హ్యారిస్ కొత్త చరిత్ర సృష్టించినట్లే. ఆమె ఇంతకుముందే ఎన్నో ఘనతలు సాధించారు. శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఆమె కీర్తిగడించారు. అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ రికార్డుకెక్కారు.
తమిళనాడుకు చెందిన…కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న ఒక్లాండ్‌లో జన్మించారు. ఆమె తల్లి మాత్రం తమిళనాడులోని సంప్రదా య కుటుంబానికి చెందినవారు. తండ్రి జమైకా దేశస్తుడు. వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివ ర్సిటీలో కమల చదువుకున్నారు. యూసీ హేస్టింగ్స్ కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు. అలమెండా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో ఎనిమిది సంవత్స రాలు పనిచేశారు. ప్రధానంగా చిన్నా రులపై జరిగే హింసకు సంబంధించిన కేసులను విచారించారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేస్తున్నప్పుడు బరాక్ ఒబామా దృష్టిలో పడ్డారు. అనంతరం డెమొక్ర టిక్ పార్టీలో చేరారు. కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు. ఆమె తల్లి ద్వారా కమలా హ్యారిస్ భారతీయులకు కూడా ప్రత్యేకంగా నిలిచారు. ఆమె గెలుపుతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేకత చాటుకున్న జగన్
ప్రపంచమంతా అమెరికా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన బైడెన్‌కు శుభాకాంక్షలు చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం బైడెన్‌కు బదులు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలాహ్యారీస్‌కు శుభాకాంక్షలు చెప్పి ప్రత్యేకత చాటుకున్నారు. అందుకు కారణం తెలిస్తే జగన్ ఆలోచనకు హ్యట్సాప్ చెప్పాల్సిందే. కమలాహ్యారీస్ భారత్ మూలాలున్న మహిళా నేత. ఆమె తల్లి తమిళనాడుకు చెందిన వారు. ఈ నేపథ్యంలోనే జగన్ స్పందిస్తూ ఆదివారం ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘‘ డెమొక్రాట్లు కానీ, రిపబ్లికన్లు కానీ, రాజకీయాల సంగతి పక్కన పెడితే.. భారత మూలాలు కలిగిన కమలా హ్యారీస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు గర్వంగా ఉంది. కమలా హ్యారీస్‌కు శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించటంతో పాటు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.