iDreamPost
iDreamPost
గుర్రం జాషువా. సమాజంలో వేళ్ళురుకుపొయిన అసమానతలపై తన కలంతో యుద్దమే చేశారాయన. నా గురువులు ఇద్దరు పేదరికం, కులమత భేధం అని.. ఒకటి సహనాన్ని నేర్పితే, రెండవది నాలో ఏదిరించే శక్తిని పెంచిందని ప్రకటించుకున్న ఆయన దానికి అనుగుణంగానే ఆ భావాలను కవితల నిండా పోందుపరిచి మాటల పిడుగులు కురిపించారు.
1895 సెప్టెంబర్ 28న ఆంద్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకోండ మండలం చాట్రగడ్డ పాడులో వీరయ్య,లింగమ్మ దంపతులకు జన్మించిన ఆయన అసమానతలతో నిండిపొయిన సమాజంలో చిన్నతనం నుండే వివక్షను ఏదుర్కుంటూ పేరిగారు. తల్లీ తండ్రిది వేరు వేరు కులములు కావడంతో తోటి విద్యార్ధుల నుండి హేళనలు, అవమానాలు చవిచూసారు. దీంతో ఆనాటి నుండే సమాజంలో వెళ్ళురుకుపొయిన వివక్షని వివిద రూపాల్లో తీవ్రంగా ప్రశ్నించటం మోదలుపెట్టిన ఆయాన చివరికి సాహిత్యాన్ని అస్త్రంగా మార్చుకుని గిజిగాడు, గబ్బిలం మోదలగు అనేక సమాజిక చైతన్యన్ని రేకెత్తించే కవితాఖండాలను రచించారు. సుమారు 25కు పైగా ఉన్న ఆయన రచనల్లో గబ్బిలం, గిజిగాడు, పిరదౌసి, ఖండకావ్యలు ప్రజల్లో విశేష ఆదరణ పోందాయి . ఆయన కావ్యాల్లో ఆనేకం విద్యార్ధులకి పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టారు అంటే ఆయన రచనల్లో నింపిన చైతన్యాన్ని, పదునుని అర్ధం చేసుకోవచ్చు.
కోంతకాలం మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో ప్రొగ్రాం డైరెక్టరుగా పని చేసిన జాషువా 1964 నుంచి 70 వరకు శాసన మండలి సభ్యులుగా తన సేవలు అందించారు. ఆయన రచనలకు గుర్తింపుగా 1966లో రాష్ట్రపతి బహుమతి వరించింది, అలాగే 1969లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళా ప్రపూర్ణ, 1970లో పద్మభాషణ్ బిరుదునిచ్చి సత్కరించారు. అలాగే సాహిత్య అకాడమీ సభ్యులుగా వ్యవహరించారు.
పద్మ భూషణ్,కళాపుర్ణ ,నవయుగ కవి చక్రవర్తి శ్రీ గుర్రం జాషువా పక్షవాతంతో భాదపడుతూ 75ఏళ్ల వయస్సులో 1971 జులై 24 ఉదయం 7:15 నిమషాలకు గుంటూరులోని వల్లూరివారి తోటలో ఉన్న ఆయన స్వగృహంలో తుది శ్వస విడిచారు. జాషువా ఆనాటికీ ఈనాటికీ సాటిలేని మహాకవి. ఆయన కవిత్వం ఎన్ని తరాలు గడిచినా చెక్కుచెదరనిది. అపారమైన కవితాశక్తితో, సరళమైన భాషను వాడి జాషువా వలె తెలుగు వారి గుండెలను దోచుకున్న కవులు తెలుగు నేలపై అత్యంత అరుదు అని చెప్పవచ్చు. ఆయన వర్ధంతి సంధర్భంగా ఆయన్ని స్మరిస్తూ ….