iDreamPost
android-app
ios-app

పేదల పాలిట పెన్నిది – ఇందిరాగాంధీ

  • Published Oct 31, 2020 | 7:36 PM Updated Updated Oct 31, 2020 | 7:36 PM
పేదల పాలిట పెన్నిది  – ఇందిరాగాంధీ

ప్రత్యర్ధుల చేత అపర దుర్గగా కీర్తించబడ్డ ధీరత్వం, గరీబీ హఠావో అంటూ బడుగు బలహీన వర్గాల పై చూపిన దాతృత్వం. బ్యాంకులని జాతీయం చేసి దేశాన్ని నడిపించిన దార్శనికత, రాజకీయాల్లో ప్రవేశించిన తోలి నాళ్లలో మైనపు బొమ్మ అంటూ హేళన చేసిన వాళ్ళే ఆమె రాజకీయ ఎత్తుగడలకు భూస్థాపితం అయిపోయిన రాజనీతజ్ఞత ఆ మహా నాయకురాలు సొంతం. ఆమే దేశమాతగా ప్రజల చేత కొలవబడ్డ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ.

సరిగ్గా 36ఏళ్ల క్రితం ఇందిర హత్యకు గురైనా ఇంకా ఆమెను , ఆమే విధివిధానాలను పలు సందర్భాలలో స్మరించుకుంటూ ఉంటారు అంటే ఆమే దేశ రాజకీయలపై ఎంత బలమైన ముద్ర వేశారో అర్ధం చేసుకోవచ్చు. అప్పటికి స్వాతంత్ర్యం వచ్చి రెండు దశాబ్దాలు కావస్తున్న సమయంలో , ప్రధాని గా ఉన్న లాల్ బహుద్దూర్ శాస్త్రి అకాల మరణం అనంతరం అన్ని వర్గాల ప్రజల ఆశాజ్యోతిగా ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా భాద్యతలు చేపట్టారు. ఆ సమయంలో దేశములో పేదరికం , బానిసత్వం అధికంగా ఉండుట, సంపద అనేది కోన్ని వర్గాల వారికే పరిమితం కావడముతో దేశం అభివృద్ది వైపు సాగాలంటే వీటన్నింటిని అదిగమించాలనే సంకల్పం ఆమెలో దృడంగా ఏర్పడింది.

ఆనాడు కాంగ్రెస్ అగ్ర నాయకులుగా ఉన్న అతిరథమహారధులైన వారు వ్యతిరేకించినా లెక్క చేయకుండా అంతరాత్మను అనుసరించి రూపాయి విలువ 57% తగ్గింపు, బ్యాంకు ల జాతీయకరణ, రాజ భరణాల రద్దు వంటి అనేక సాహసోపేత నిర్ణయములు అమలు చేసి ప్రజాదరణ పొందినారు. ఇందిరా గాంధీ పరిపాలనా వ్యవస్థలో తీసుకోని వచ్చిన విప్లవాత్మక మార్పుల వలన దేశ ప్రజలందరికి లాభం కలిగినా అధికంగా లాభపడినవారు మాత్రం బడుగు బలహీన వర్గాలవారే అని చెప్పక తప్పదు.

బడుగులకు అండగా విప్లవాత్మకమైన నిర్ణయాలు

ఇందిరా గాంధీ బలహీన వార్గాలకి చేసిన మేలు లో అత్యంత ప్రధానమైనది వారికి సామాజిక పరంగా ఆసరా కల్పించటం. ఇందిరా గాంధీ తీసుకున్న ఈ విప్లవాత్మకమైన నిర్ణయాన్ని కొంతమంది సోంత పార్టీ వారే వ్యతిరేకించినా దైర్యం గా అమలు చేసిన ఘనత ఆమే కే చెల్లుతుంది. అనాది కాలం నుండి సమాజం నుండి వేలి వేయబడి సమాజంలో అందరితో పాటు కలిసి మెలిసి జీవించే అవకాశానికి నోచుకోక ఊరికి దూరంగా గుడిసెలో మగ్గిపోతున్న వారికి సమాజంలో సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేశారు. వారికి ఉచిత విద్య , ఫీజులు తగ్గింపు , హాస్టల్ లో వసతి సౌకర్యం , కాలనీ పేరుతో ఉచిత గృహనిర్మాణం వంటి అనేక ప్రత్యక సౌకర్యాలు కల్పించినారు. అలాగే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించు పధకం ప్రవేశ పెట్టడంతో సన్న కారు , చిన్న కారు రైతులు ఎంతో లబ్ది పోందారు.

వెట్టిచాకిరీ రద్దు చట్టం

తరతరాలు క్రితం ఎప్పుడో తాతలు తండ్రులు చేసిన అప్పును వాటి పై పెరుగుతున్న వడ్డీని తీర్చుట కోసం ఏళ్ళు తరబడి వెట్టి చాకిరి చేసినా అప్పు తీరక పోగా వడ్డీ కూడా తీరని దీన స్థితిలో మగ్గిపోతున్న ఎందరో అభాగ్యులని ఈ వెట్టి చాకిరి నిర్మూలన చట్టం తో విముక్తి పోందేలా చేశారు ఇందిర. ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత బానిసత్వం ఉక్కు సంకెళ్లు బద్దలైపోయాయి, వేలాదిమంది మామూలు జీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇలా బడుగలకి అండ గా నిలిచిన ఇందిర దేశ రాజకీయ మకుటానికి కలికితురాయిగా నిలిచిపోయారు. నేడు ఆ మహా నాయకురాలు 36వ వర్ధంతి సందర్భం గా స్మరిస్తూ