iDreamPost
android-app
ios-app

జేసీ దివాకర్‌రెడ్డికి షాక్ – 100 కోట్ల జరిమానా..

జేసీ దివాకర్‌రెడ్డికి షాక్ – 100 కోట్ల జరిమానా..

టీడీపీ మాజీ ఎంపీ  జేసీ దివాకర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ అధికారులు షాక్‌ ఇచ్చారు. 14 లక్షల మెట్రిక్ టన్నుల దోపిడీ జరిగినట్లు గుర్తించిన అధికారులు ఏకంగా 100 కోట్ల జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు కేసుల్లో చిక్కుకున్న జేసీ జేసీ దివాకర్‌రెడ్డికి ఇది ఒకరకంగా పెద్ద షాక్ అనే చెప్పాలి.

వివరాల్లోకి వెళితే జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో 14 లక్షల మెట్రిక్ టన్నుల లైమ్ స్టోన్‌ను అక్రమంగా తవ్వితీసి త్రిశూల్‌ సిమెంట్ ఫ్యాక్టరీలో వినియోగించారని మైనింగ్ అధికారులు గుర్తించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని ఉపయోగించుకుని తమ కుటుంబ సభ్యుల పేర్లు బయటకు రాకుండా తన వద్ద పనిచేసే వారి పేరిట సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతులు పొందిన జేసీ దివాకర్ రెడ్డి యథేచ్ఛగా లైమ్ స్టోన్ దోపిడీకి తెర తీశారు.

గతంలో జేసీ ట్రావెల్స్ నిర్వహణ కోసం నకిలీ పత్రాలు సమర్పించి బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌-4గా మార్చి జేసీ దివాకర్ రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో దివాకర్‌రెడ్డి కుటుంబీకులకు చెందిన సుమన, భ్రమరాంబ మైనింగ్‌ సంస్థల్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తాజాగా కోన ఉప్పలపాడులో జరిపిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో 100 కోట్ల జరిమానా కట్టకపోతే ఆర్అండ్ఆర్ చట్టం కింద జేసీకి చెందిన ఆస్తుల జప్తు చేస్తామని అధికారులు హెచ్చరించారు. మరి ఈ వ్యవహారంపై జేసీ ఎలా స్పందింస్తారో వేచి చూడాలి.