Idream media
Idream media
కేసీఆర్ మాటలే తప్ప కరోనా కట్టడికి ఏమీ చేయడంలేదు. ఇద్దరు మంత్రులకు కరోనా రావడంతో మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకూ భయపడుతున్నారు. దేశంలో ఏపీ, కేరళ రాష్ట్రాలు కరోనాను బాగా కట్టడి చేస్తున్నాయి. ఏపీకి వెళితే కరోనా సోకినా ప్రాణ భయం లేదు. నిన్న వెయ్యి 108, 104 వాహనాలు ఒక్కసారి ప్రారంభించారు. జగన్ ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేదు. పరిపాలన బాగా చేస్తున్నాడు… ఇదీ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఓ బుక్ స్టాల్ వద్ద స్థానికులు మాట్లాడుకుంటున్న మాటలు.
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య ఉన్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కేరళతో సహా ఏపీలో ఆ పరిస్థితి లేకపోవడం విశేషం. వైరస్‌పై కేరళ అనుసరించిన విధానం మంచి ఫలితాలను ఇచ్చింది. అక్కడ కేసులు నమోదవుతున్నా ప్రాణ నష్టం మాత్రం చాలా తక్కువగా ఉంది. దేశ వ్యాప్తంగా కేరళ పనితీరుపై ప్రశంసలు వచ్చాయి.
అన్ని రాష్ట్రాలతోపాటు ఏపీలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే వైసీపీ సర్కారు చేపట్టిన పటిష్టమైన చర్యలు ప్రజల్లో భరోసా నింపాయి. కరోనా కట్టడికి కావాల్సింది ఎక్కువ పరీక్షలు చేయడం, వైరస్ వచ్చిన వారిని చికిత్సకు తరలించి వైరస్ గోలుసును తెంచడం. ఇదే పని ఏపీ యుద్ధ ప్రాతిపదికన చేసింది. మార్చిలో కేవలం తిరుపతిలో మాత్రమే కరోనా పరీక్షలు చేసే వైరాలజీ ల్యాబ్ ఉంది. రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో వైరాలజీ ల్యాబులు ఏర్పాటు చేశారు. రోజులకు పదుల సంఖ్యలో జరిగే పరీక్షలు ఆ తర్వాత వందలు, ఇప్పుడు వేల సంఖ్యకు చేరుకున్నాయి. కరోనా పరీక్షలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.
అటు పరీక్షలు చేయడంతోపాటు ఇటు బాధితులకు ఉచితంగా జగన్ సర్కార్ వైద్యం అందిస్తోంది. కరోనా సోకిన ప్రతి ఒక్కరికీ చికిత్స అందిచడంతోపాటు వారు కోలుకుని ఇంటికి వెళ్లే సమయంలో దారి ఖర్చులకూ రెండు వేల రూపాయలు నగదు జగన్ ప్రభుత్వం అందిస్తోంది. అదే సమయంలో క్వారంటైన్‌లో ఉన్న వారికి నాణ్యమైన భోజనం, వారు వెళ్లే సమయంలోనూ రెండు వేల రూపాయల నగదును అందిస్తూ ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజలకు మేలు చేస్తోంది. ఆస్పత్రిలు, క్వారంటైన్ కేంద్రాల్లో వసతులు, నాణ్యమైన పౌష్టికాహారం అందిచడంతో ప్రారంభంలో వైరస్ సోకినా చెప్పుడానికి, ఆస్పత్రికి వెళ్లడానికి సంకోచించిన ప్రజలు ఇప్పుడు పరీక్షలు చేయించుకునేందుకు, చికిత్స తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి చికిత్స అందించడం వీలవుతుంది.
ప్రారంభంలో కరోనా సోకిన వారిని, వారితో కలిసిన వారిని అధికారులే వెతికి పట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ మొత్తం ప్రక్రియలో గ్రామ, వార్టు వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇతర ప్రాంతాలను నుంచి ఎవరు వస్తున్నారు..? ఎవరైనా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారా..? ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు హోం క్వారంటైన్‌లో ఉంటున్నారా..? లేదా..? అనే విషయాలు వాలంటీర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ సమాచారం తమ వద్ద ఉన్న ఫోన్ల ద్వారా ప్రభుత్వానికి చేరవేస్తున్నారు.
మార్చి, ఏప్రిల నెలలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్లు సూచిన వారు.. కేసీఆర్ ప్రజలకు భరోసా ఇస్తున్నారని భావించారు. అయితే ఇప్పుడు మాటలతోనే భరోసా ఇచ్చారు కానీ కరోనా కట్టడిలో మాత్రం విఫలమయ్యారని హైదరాబాద్ వాసులే అంటున్నారు. అదే సమయంలో ఏపీ సీఎం జగన్ పట్ల ఏపీ ప్రజలతోపాటు దేశ విదేశాల్లోని తెలుగు వారి ఆలోచన తీరు పూర్తిగా మారిపోయింది.