ఇప్పుడంతా వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. సినిమా ది¸యేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయో తెలియని నేపథ్యంలో, హీరోయిన్లు ఓ వైపు సినిమాలకు కమిట్ అవుతూనే, వెబ్ సిరీస్‌లపై మోజు ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఓ బ్యూటిఫుల్ హీరోయిన్ ఓ వెబ్ సిరీస్‌కి కమిట్ అయ్యిందట.. ఇందుకోసం ఆమెకు భారీగా రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు, నితిన్ సరసన రెండు సినిమాల్లో కనిపించిన మేఘా ఆకాష్. ‘లై’, ‘ఛల్ మోహనరంగ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన మేఘ, ప్రస్తుతం కొన్ని తమిళ సినిమాలు చేస్తోంది. ఈ బ్యూటీ కోసం టాలీవుడ్ నుంచి ఓ ప్రముఖ నిర్మాత భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా ఇచ్చేందుకు ముందుకొచ్చారట. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఆ వెబ్ సిరీస్ వివరాలు తెలియాల్సి వుంది. సాధారణంగానే వెబ్ సిరీస్ అంటే అందులో హాట్ కంటెంట్‌కి ప్రాధాన్యతనిస్తుంటారు. సో, మేఘ కూడా అలా హాట్ హాట్‌గా అందాల ఆరబోత కోసమే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందా.? అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు వెబ్ సిరీస్‌ల పేరుతో హాట్ హాట్‌గా డిజిటల్ ప్లాట్‌ఫావ్స్‌ు మీద అందాల ఆరబోసేస్తున్న విషయం విదితమే. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. గ్లామర్ వున్నప్పుడే అవకాశాలు దక్కించుకోవాలి. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా, ఇంకోటైనా.! ఈ సూత్రాన్నే చాలామంది అందాల భామలు పాటిస్తున్నారు.