iDreamPost
android-app
ios-app

Sree Leela : పెళ్లి సందడి భామకు భారీ అవకాశం

  • Published Feb 07, 2022 | 8:36 AM Updated Updated Feb 07, 2022 | 8:36 AM
Sree Leela : పెళ్లి సందడి భామకు భారీ అవకాశం

ఆ మధ్య వచ్చిన శ్రీకాంత్ వారసుడు రోషన్ పెళ్లి సందడి సినిమా బాగుందా లేదానేది పక్కనపెడితే చాలా చోట్ల డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన డబ్బులు వెనక్కు తెచ్చిన మాట వాస్తవం. ఫలితంతో సంబంధం లేకుండా హీరో హీరోయిన్లు ఇద్దరూ బిజీ అయిపోయారు. ముఖ్యంగా శ్రీలీలకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం తను రవితేజ ధమాకా చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం యూత్ హీరోలతోనే చేయాలనే నియమం పెట్టుకోకుండా మాస్ మహారాజాకు జోడిగా కనిపించేందుకు ఒప్పుకోవడం విశేషమే. గ్లామర్ తో పాటు డాన్స్ లోనూ మంచి ఈజ్ చూపిస్తున్న శ్రీలీలకు సరైన హిట్టు పడితే కెరీర్ గ్రాఫ్ అమాంతం ఎక్కడికో వెళ్ళిపోతుంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల పేరు పరిశీలనలో ఉందట. ముందు భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్ ని అనుకున్నారు కానీ ఏవో కారణాల వల్ల తను చేయడం లేదట. ఆ స్థానంలో శ్రీలీల అయితే బాగుంటుందన్న అభిప్రాయం యూనిట్ లో కలగడంతో ఆ మేరకు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. ఓకే అయ్యాకే అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి అప్పటిదాకా ఇది లీక్ గానే తీసుకోవాలి. సర్కారు వారి పాటలో బిజీగా ఉన్న మహేష్ ఏప్రిల్ నుంచి దీని రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారు. టైటిల్ ఇంకా ఫైనల్ చేయలేదు.

సరిలేరు నీకెవ్వరూ తర్వాత రెండున్నర సంవత్సరాలు గ్యాప్ కావడంతో రాజమౌళి కన్నా ముందు మహేష్ ఈ రెండు సినిమాలు వేగంగా పూర్తి చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. సర్కారు వారి పాట మేలో వస్తే త్రివిక్రమ్ మూవీ 2023 సంక్రాంతి లేదా వేసవికి వస్తుంది. ఆపై జక్కన్న కోసం ఎంతలేదన్నా రెండేళ్ల దాకా త్యాగం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దాని తాలూకు పనుల్లోనే రచయిత విజయేంద్ర ప్రసాద్, రాజమౌళిలు బిజీగా ఉన్నారు. పైన చెప్పినట్టు శ్రీలీలకు నిజంగానే మహేష్ మూవీలో ఆఫర్ వచ్చి ఓకే అయితే బంపర్ ఆఫర్ కొట్టినట్టే. కాకపోతే అల వైకుంఠపురములో నివేదా థామస్ లాగా కాకుండా కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఉంటే బెటర్

Also Read : Liger : పూరి విజయ్ బ్యాక్ టు బ్యాక్ – ఏంటి కథ

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom Girişenbet girişHoliganbet Giriş