iDreamPost
iDreamPost
వైల్డ్ డాగ్ రిలీజ్ కు ముందు జరిగిన ఒక ఈవెంట్ లో నాగార్జున తన తండ్రి స్వర్గీయ అక్కినేని నాగేశ్వర్ రావు గారి బయోపిక్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పాజిటివ్ గా స్పందించడం అభిమానుల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఖచ్చితంగా తీస్తానని చెప్పలేదు కానీ మనసులో ఆలోచన ఉందని జరిగే అవకాశాలను కొట్టిపారేయలేనని ఇన్ డైరెక్ట్ గా చెప్పడం ఆశలు కలిగించింది. ఏఎన్ఆర్ కాలం చేశాక ఆయన కథను ఎవరైనా తెరమీద చూపిస్తే బాగుంటుందన్న కామెంట్స్ ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకుల్లోనూ వచ్చాయి.కానీ ఈ సంకేతాలు నాగార్జున ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. జస్ట్ అలా విని వదిలేశారంతే.
ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇప్పుడీ బయోపిక్కులు తీయడం ఏమంత సేఫ్ కాదు. రిస్క్ ఉంటుంది. అశేష అభిమాన గణం ఉన్న ఎన్టీఆర్ జీవితాన్ని స్వయంగా ఆయన వారసుడు బాలకృష్ణ తీస్తేనే జనం ఆమోదించలేదు. డ్రామా లేని స్టోరీలు తెరమీద పండవు. అందుకే మహానటిలో అద్భుతంగా పండిన ఎమోషన్లు ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడుకు వచ్చేటప్పటికి జీరో అయ్యాయి. దీంతో డిజాస్టర్ తప్పలేదు. ఓ సందర్భంలో నాగబాబు కూడా అన్నయ్య చిరంజీవి లైఫ్ ని స్క్రీన్ మీద చూపించలేమని ఆయన కష్టపడినా తెరకు సరిపడా డ్రామా లేదు కనక ఆ ఆలోచన లేదని తేల్చి చెప్పారు.
ఈ లెక్కన చూస్తే చివరిదాకా చక్కని జీవితాన్ని ఆస్వాదించి నటనపరంగా వ్యక్తిగతంగానూ సంపూర్ణత్వాన్ని అనుభవించిన నాగేశ్వర్ రావు గారి కథను ఇప్పటి జనరేషన్ కు నచ్చేలా తీయడం కత్తి మీద సాము. ఏఎన్ఆర్ జీవితం మీద ఆయన ఇతరులు రాసిన కొన్ని పుస్తకాలు మార్కెట్ లో ఉన్నాయి. చాలా ఏళ్ళ క్రితం గుర్తుకొస్తున్నాయి అనే వీడియో ఇంటర్వ్యూని సిరీస్ రూపంలో చేశారు. వాటన్నటికి మంచి ఆదరణ దక్కింది. కానీ ఆ గ్యారెంటీ సినిమా ఇవ్వదు. అందుకే నాగార్జున సైతం చాలా స్మార్ట్ గా ఆలోచన ఉందన్నారు కానీ ఖచ్చితంగా తీసే తీరతామని చెప్పలేదు. ఆ మాటకొస్తే స్క్రీన్ మీద ఏఎన్ఆర్ లా వంద శాతం మెప్పించే యాక్టర్ ఎవరున్నారని.