iDreamPost
iDreamPost
ఏపీలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని, కేంద్రం కన్నెర్ర చేసిందని, ఏకంగా ఆర్థిక ఎమర్జెన్సీ కూడా వచ్చేస్తోందని ఎంతో గట్టిగా అరచిగీపెట్టిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు స్వరం మార్చుతోంది. ఆ పత్రిక యాజమాన్యం ఆశించినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి లేదు. కేంద్రం ఆగ్రహంతో ఉందనే కహానీలకు అర్థమే లేదు. అయినా జ్యోతి చిత్రాలు మాత్రం ఆపదు. అందుకు తాజా ఉదాహరణ ఏపీలో ఆదాయం పీడీ ఖాతాల్లో పక్కదారిపట్టించారని, చివరకు ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యన్నారాయణ మీద కూడా ఇటీవల కథలు వండి వార్చింది.
అసలు వాస్తవం ఏమంటే చంద్రబాబు హయంలో ఇలా నిధులు పక్కదారి పట్టించడం హద్దూ అదుపు లేకుండా సాగింది. అప్పట్లో జ్యోతికి భారీగా ఆదాయం సమకూర్చిన బాబు మీద నోరు మెదపడానికి ముందుకు రాలేదు. పైగా బాబుని భుజానమోయడమే పనిగా పెట్టుకోవడంతో నిజాలు కప్పిపుచ్చింది. చంద్రబాబు పాలనలో బాబు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కూడా వివిధ శాఖల పేరిట భారీగా అప్పులు తెచ్చారు. అందులో అప్పు చేసిన రూ. 10 ,538 ని ఓటర్లను మభ్యపెట్టేందుకు వినియోగించారు. పసుపు- కుంకమ అంటూ పంచిపెట్టిన పప్పు బెల్లాలకు వాడేశారు. దీనిని కాగ్ నివేదిక కూడా తేటతెల్లం చేసింది.
కేవలం అప్పు చేసిన మొత్తమే గాకుండా 2018–19 రబీలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు కూడా చెల్లించకుండా వాటిని సైతం పసుపు- కుంకమ కోసం వెచ్చించేశారు. ఏకంగా రూ.4,838 కోట్లను ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టడంతో వాటిని జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు చెల్లించాల్సి వచ్చింది. అంటే 2019-20 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉండగానే చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.
సివిల్ సప్లయిస్ శాఖకు చెందిన నిధులు మాత్రమే గాకుండా రోడ్లు వేయడం కోసం అంటూ తెచ్చిన అప్పులను కూడా పక్కదారిపట్టించేశారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరిట రూ. 3 వేల కోట్లు అప్పు తీసుకొని ఎన్నికల ప్రయోజనం కోసం వాడేశారు. దేవాదాయ శాఖ నిధుల విషయం కూడా కాగ్ రిపోర్టు ఎద్దేవా చేసింది. ప్రభుత్వ అవసరాల్లో చివరకు వాహనాల ఇంధనం, వాటి మెయింటెన్స్ పేరుతో 8 ఆలయాలకు చెందిన రూ. 10 కోట్లు వినియోగించడం చంద్రబాబుకే చెల్లింది.
బాబు హయంలో ఇలాంటి వ్యవహారాలు ఇంకా ఎన్నెన్నో జరిగినా ఎన్నడూ అది అంధజ్యోతికి నేరంగా కనిపించలేదు. కానీ జగన్ పాలనలో ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తున్న తీరు మీద విపరీతమైన యాగీ చేస్తోంది. కేవలం విద్యాశాఖలోనే రెండేళ్లలో రూ. 25వేల కోట్లు వినియోగించిన జగన్ ప్రభుత్వం భవిష్యత్తుని నిర్మించడం ఆంధ్రజ్యోతికి గిట్టడం లేదని స్పష్టమవుతోంది. బడులు బాగుపడినా, రాష్ట్రం కుదుటపడినా తమ గిట్టదని పచ్చ మీడియా నిరూపించుకుంటోంది. ప్రజలు విశ్వసించకపోయినా నిత్యంవిషం జల్లే ప్రక్రియ మాత్రం ఆపడం లేదంంటే అదే కారణమని భావించాల్సి ఉంటుంది.
Also Read : బాబు రాజకీయాలు.. పెదవి విరుస్తున్న తమ్ముళ్లు..