iDreamPost
iDreamPost
ఏ ఆటంకం లేకుండా చదువులు కొనసాగాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందజేస్తున్న విద్యాకానుక సత్ఫలితాలిస్తోంది. పాఠశాల ప్రారంభించిన రోజే విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు, ఇతర సామగ్రని ఒక కిట్‌గా అందజేయడం ఈ పథకం ప్రత్యేకత.
తల్లిదండ్రుల ఆర్థిక భారం తగ్గించాలని..
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అంటారు. ఈ విషయాన్ని పూర్తిగా నమ్మిన వైసిపి ప్రభుత్వం తరగతి గదుల స్థితిగతులను మున్నెన్నడూ చూడని రీతిలో మెరుగుపరచింది. మన బడి నాడు నేడు కార్యక్రమం పేరుతో పాఠశాలల రూపురేఖలను కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మార్చేసింది. గదుల్లో రంగులు వేసి, చక్కని బ్లాక్ బోర్డులు, ఇంగ్లిష్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. ప్రతి గదికి సీలింగ్ ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, ఆధునికంగా ఉన్న డెస్క్ టేబుళ్లు, టాయిలెట్, నీటి సదుపాయాలను కల్పించింది. విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేసి తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించింది.
Also Read : దేశంలోనే మొదటి హరికథా పాఠశాల ఏపీలో ఎక్కడ ఉందో తెలుసా..?
విద్యాకానుక కిట్‌లో ఏం ఉంటాయి?
నాణ్యమైన మూడు జతల యూనిఫారమ్ క్లాత్(కుట్టుకూలితో సహా), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్, బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌బుక్‌లు, ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ తెలుగు డిక్షనరీ విద్యాకానుక కిట్‌లో ఉంటాయి. రెండేళ్లుగా పాఠశాల తెరిచిన రోజే ఇవన్నీ విద్యార్థులకు అందిస్తున్నారు. ప్రభుత్వం ఈ విద్యాకానుక కోసం 2020 – 21 విద్యా సంవత్సరంలో 42,34,322 మంది విద్యార్థులకు రూ. 648.10 కోట్లు వెచ్చించింది. 2021 – 22 విద్యా సంవత్సరంలో 47,32,064 మంది విద్యార్థులకు 731.30 కోట్లు ఖర్చు చేసింది. ఈ రెండేళ్లలోనే కేవలం విద్యాకానుక అందజేయడానికి రూ.1,379.40 కోట్లు వెచ్చించింది. మొత్తం విద్యారంగంలో అమలు చేస్తున్న ఆరు వినూత్న పథకాలకు ఈ రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన వ్యయం రూ.29.114.37 కోట్లు.
సత్ఫలితాలిస్తున్న చిత్తశుద్ధి..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధికి అద్దం పట్టేలా ఉన్న ఈ లెక్కలు విద్యార్థులను సర్కారీ పాఠశాలల వైపు నడిపిస్తున్నాయి. అందువల్లే గడచిన రెండేళ్లలో ప్రైవేట్ పాఠశాలల నుంచి దాదాపు 6లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఇంగ్లిషు మీడియం విద్యను అందిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ సదుపాయాలన్నీ అందుతున్నాయి.
ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను జాలిగా చూసే జనం నేడు అక్కడే వారి పిల్లలను చదివించేందుకు ఆసక్తి చూపడం గొప్ప పరిణామం. ఒక నాయకుడు సంస్కరణలకు నడుం బిగిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్‌లో అనతికాలంలోనే రుజువైంది. చదువులకు చేసే ఖర్చంతా పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి అని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా విద్యారంగంపై ఇంత భారీ ఎత్తున ఖర్చు చేయడం ప్రశంసలు అందుకుంటోంది.
Also Read : సీఎం జగన్ గురించి అగ్రిగోల్డు బాధితులు ఏమనుకుంటున్నారు..?