iDreamPost
iDreamPost
మొదలుపెట్టిన ముహూర్తం ఏమో గాని సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన ఫస్ట్ కాపీ సిద్ధమయ్యే స్టేజిలో కరోనా వచ్చి విడుదల ఆగిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ ఆడియో ముందే బ్లాక్ బస్టర్ కావడంతో అంచనాలు బాగా పెరిగాయి. అందులోనూ విజయ్ సేతుపతి విలన్ రోల్, సముద్ర నేపథ్యంలో తదితరాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాతలు గతంలోనే స్పష్టం చేశారు కానీ నాని వి ఓటిటి రిలీజ్ కన్ఫర్మ్ చేసుకున్నాక అన్ని సినిమాల గురించి వివిధ రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సదరు సంస్థల నుంచి ప్రతిపాదనలు అందరికీ వస్తున్న మాట నిజమే కానీ ఎవరు ఒప్పుకున్నారు ఎవరు వద్దాన్నారు లాంటి సమాచారం మాత్రం బయటికి రావడం లేదు.
చూస్తుంటే కాస్త అటు ఇటు డిసెంబర్ దాకా ఇదే పరిస్థితి కొనసాగేలా ఉండటంతో అధిక శాతం డిజిటల్ వైపు మొగ్గు చూపడం తప్పేలా లేదు. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఉప్పెన కనక డిజిటల్ దారిలో వెళ్లాల్సి వస్తే రెండు భాగాలుగా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చర్చల దశలో ఉందట. దీనికి సంబంధించి ఇప్పటికే చిరంజీవి దగ్గర ప్రతిపాదన కూడా ఉంచినట్టు ఇన్ సైడ్ టాక్. అలా అయితే హక్కుల రూపంలో డబుల్ అమౌంట్ తో పాటు ఆడియన్స్ కి ఇంకా బాగా రీచ్ అవుతుంది. ఎలాగూ అంత మొత్తానికి సరిపడా ఫుటేజ్ ఉప్పెన టీమ్ వద్ద ఉందట. అయితే ఇదంతా ఖరారుగా తెలిసిన సమాచారం మాత్రం కాదు. ఫిలిం నగర్లో ఈ కోణంలో గట్టి వార్తలే వినిపిస్తున్నాయి.
ఇంకో మూడు నాలుగు నెలలు వేచి చూసే పరిస్థితి స్థోమత ఉందంటే ఆగిపోవచ్చు. అలా కాకుండా పెట్టుబడుల భారం ఉందనుకుంటే మాత్రం ఆప్షన్ చూడక తప్పదు. వైష్ణవ్ తేజ్ డెబ్యూ కాబట్టి థియేటర్లోనే రావాలని మెగా ఫ్యామిలీ ఆకాంక్ష. ఎలాగూ బజ్ ఉంది ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ఇదంతా లాక్ డౌన్ కు ముందు. ఇప్పుడు అదే స్థాయి స్పందన ఆశించడం కష్టమే. నాని వికు వచ్చే రెస్పాన్స్ కోసం ఇతర నిర్మాతలు ఎదురు చూస్తున్న మాట వాస్తవం. ప్రస్తుతానికి మాత్రం మైత్రి సంస్థ థియేట్రికల్ రిలీజ్ కే కట్టుబడి ఉంది. బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్న ఉప్పెనలో క్రితి శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతోంది.