iDreamPost
android-app
ios-app

కరోనా నుండి కోలుకున్న హోంశాఖ మంత్రి అమిత్‌షా

కరోనా నుండి కోలుకున్న హోంశాఖ మంత్రి అమిత్‌షా

కరోనా బారినుండి హోంశాఖ మంత్రి అమిత్‌షా కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఈ నెల 2 వ తేదీన అమిత్‌షాకు కరోనా సోకింది. కాగా తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌ అని తేలింది.

మరికొన్ని రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలని అమిత్‌షాకు వైద్యులు సూచించడంతో ఆయన ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారు. తాను త్వరగా కోలుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతీ ఒక్కరికీ అమిత్‌షా కృతజ్ఞతలు తెలిపారు. దేవుడి దయ వల్ల కరోనా నుండి కొలుకున్నానని ఆయన వెల్లడించారు.

కాగా ఇటీవల అమిత్‌షా కరోనా నుండి కొలుకున్నారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా అమిత్‌షాకు ఎలాంటి కరోనా పరీక్షలు నిర్వహించలేదని హోంశాఖ వర్గాలు ఆ వార్తలను ఖండించాయి. దాంతో ఎంపీ మనోజ్ తివారీ ఆ ట్వీట్ ను తొలగించారు.