iDreamPost
android-app
ios-app

రేపు హైకోర్టు లో తేలనున్న స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం

రేపు హైకోర్టు లో తేలనున్న స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం

ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ సర్పంచ్‌లకు ఎన్నికల నిర్వహణపై గురువారం ఒక స్పష్టత రానునట్టు తెలుస్తుంది. పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 28న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఎన్నికల నిర్వహణపై స్టే విధిస్తూ ఈ విషయాన్ని రాష్ట్ర హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్ట్ సూచించింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఈ కేసు గురువారం విచారణకు రానుంది .

వాస్తవానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ నెల 17నే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాల్సి ఉండగా, సుప్రీంకోర్టు స్టే కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నలుగురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో వాటిపై 30వ తేదీ (గురువారం) విచారణ జరగనుంది. అయితే ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా 59.85 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలా ?? లేదా 50 శాతానికే పరిమితం చేయాలా ?? ఈ క్రమంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే అంశాలు హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటాయని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయ అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ అధికారులు చెప్పారు.

ప్రభుత్వం గత డిసెంబర్ లో ప్రకటించిన విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే నిర్ణయించిన 59.85 శాతం రిజర్వేషన్లను హైకోర్టు 50 శాతానికి పరిమితం చేస్తే, ఆ మేరకు 9.85 శాతం రిజర్వేషన్లను బీసీలకు తగ్గించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రాజ్యాంగం ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు రాష్ట్రంలో వారి జనాభా నిష్పత్తి ప్రకారం 6.77 శాతం ఎస్టీలకు, 19.08 శాతం ఎస్సీలకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. ఈ కోటా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు పోగా బీసీలకు 24.15% మేర మాత్రమే రిజర్వేషన్లు కల్పించడానికి అవకాశం ఉంది. అయితే రాష్ట్రప్రభుత్వం మాత్రం 59.85 శాతం రిజర్వేషన్ల ప్రకారం ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించింది. బిసిలకు అదనంగా కేటాయించిన 9.8 శాతం కోటాపై నే కర్నూల్ జిల్లాకి చెందిన బిర్రు ప్రతాప్ రెడ్డి  సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomgrandpashabetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet güncel girişjojobet giriş