iDreamPost
android-app
ios-app

ఏపీ ప్రభుత్వంపై వరుస ఫిర్యాదులు..కీలక తీర్పును వెలువరించిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వంపై వరుస ఫిర్యాదులు..కీలక తీర్పును వెలువరించిన హైకోర్టు

జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్న దానిపై హైకోర్టులో పిటీషన్ వేయడం లేక ప్రజా వాజ్యాలు వేయడం వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఓ కీలక నిర్ణయాన్ని వెలువరించింది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అడ్డుకుంటూ జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా ఇప్పటి వరకు హైకోర్టు 330 పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఏ ప్రభుత్వంలో కూడా జరగని విధంగా జగన్ ప్రభుత్వంలోనే ఇన్ని పిటీషన్లు దాఖలు కావడం గమనార్హం. ఈ విధంగా జగన్ సర్కార్ ఓ నయా రికార్డు క్రియేట్ చేసింది.

అభివృద్ధి జరగకుండా ప్రతి పనిని పిటీషన్లు వేస్తూ అడ్డుకుంటున్నారని ప్రభుత్వ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మూడు రాజధానుల నిర్ణయంతో బాటు పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంగ్లీష్ మీడియం లాంటి పలు ప్రభుత్వ నిర్ణయాలపై పిటీషన్లు దాఖలు అయ్యాయి. దీనిపై సమగ్ర విచారణ కోసం హైకోర్టు స్టే ఇవ్వడం జరుగుతోంది. దీంతో ఏపీలో ప్రభుత్వానికి న్యాయమూర్తులకు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో వైసీపీ ఎంపీలు పార్లమెంట్ వేదికగా ఆందోళనకు దిగారు.

హైకోర్టు కీలక తీర్పు

ఈ నేపథ్యంలో ఓ పిటీషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఓ కీలక తీర్పును వెలువరించింది. ఏ అంశంలోనైనా నేరుగా హైకోర్టులో ఫిర్యాదు చేయరాదని పిటీషనర్ కు స్పష్టం చేసింది. ఏ అంశంపైన కోర్టును ఆశ్రయించేటప్పుడు ఆ అంశంపై అధికారికి వినతి పత్రం ఇవ్వాలని వెల్లడించింది. ఇకపై న్యాయం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించకుండా నేరుగా న్యాయస్థానాలకు వస్తే ఆ ఫిర్యాదులను స్వీకరించబోమని హెచ్చరించింది. ఈ మేరకు ధర్మాసనం ఓ కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఇదే ఆదేశాలు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది.

వెనుక బడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం వేరే పనులకు డైవర్ట్ చేశారంటూ ఓ వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జపారాలంటూ ఆయన పిటీషన్ లో కోరారు. ఈ పిటీషన్ ను విచారించిన హైకోర్టు ప్రభుత్వాన్ని ముందుగా సంప్రదించాలని సూచించింది. అక్కడ న్యాయం జరగకపోతేనే తమ వద్దకు రావాలంటూ స్పష్టం చేస్తూ ఆ పిటీషన్ ను కొట్టివేసింది. హైకోర్టు కీలక తీర్పు నేపథ్యంలో జగన్ సర్కార్ పై ఫిర్యాదులు తగ్గిపోనున్నాయని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.